సారథి, గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువారం మండలం చీమలకుంటపల్లి, తుమ్మవానిపల్లి, గునుకుల కొండపూర్, మోత్కుపల్లి, చొక్కాలపల్లి, గుండ్లపల్లి గ్రామస్తులు తోటపల్లి సర్కార్ దవాఖానకు పోతే అక్కడ టెస్టులు చేయడం లేదని, మీది కరీంనగర్ జిల్లా, తమది సిద్దిపేట జిల్లా అని కొందరు డాక్టర్లు, వైద్యసిబ్బంది ప్రాంతీయ బేధాలు చూపుతున్నారని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బామండ్ల రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు కి.మీ. దవాఖానాను వదిలి 33 కి.మీ. దూరంలో ఉన్న దవాఖానాకు […]
సారథి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా […]
సారథి, ములుగు: కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్నందున ప్రభుత్వం జారీచేసిన లాక్ డౌన్ ఉత్తర్వులను ప్రజలంతా విధిగా పాటించాలని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయట తిరిగే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కేసునమోదు చేశామని, అంతేకాకుండా కొవిడ్ నిబంధనలు పాటించకుండా, సామాజిక దూరం పాటించకుండా కిరాణ సరుకులు అమ్మిన నవీన్ రెడ్డిపై […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని డీసీసీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని అఖిలపక్ష నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ను ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజారోగ్యాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని మండిపడ్డారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కొవిడ్ ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఈనెల 9న స్థానిక ఎమ్మెల్యే […]
వైన్స్ముందు గంటలకొద్దీ క్యూ లైన్ కాటన్లు కాటన్లు మద్యం బయటకు.. భౌతికదూరం పాటించని వైనం కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్ సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా […]