Breaking News

Day: April 23, 2021

కరోనాను తరిమికొడదాం

కరోనాను తరిమికొడదాం

సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు […]

Read More
వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రపల్లి గ్రామాల్లో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ రవీందర్ ప్రారంభించారు. వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర్ల సరోజ కొనుగోలు సెంటర్​ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు ధ్యావ అనంతరెడ్డి, ఊట్కూరి అనిల్ రెడ్డి, లచ్చయ్య, కరుణాకర్, వీర్ల రవీందర్ రావు, సిబ్బంది మల్లేశం, నరేష్, ఇతర రైతులు పాల్గొన్నారు.

Read More
మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు

సారథి, పెద్దశంకరంపేట: రోజురోజుకూ కొవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో అన్ని వర్తక, వాణిజ్య, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ కోరారు. శుక్రవారం పేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ మైక్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈవో విఠల్​, పంచాయతీ సిబ్బంది […]

Read More
సమరయోధుడు కొండ చిన్నమల్లయ్య ఇకలేరు

సమరయోధులు కొండ చిన్నమల్లయ్య ఇకలేరు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సమరయోధులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం ఉపాధ్యక్షుడు కొండ చిన్న మల్లయ్య శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మల్లయ్య మృతిపట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి […]

Read More
మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్​కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా […]

Read More
బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

బట్టలు ఉతికేందుకు వెళ్లి మృతి

సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
హమ్మయ్య.. ఆక్సిజన్​బండి వచ్చేసింది!

హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!

సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ […]

Read More
మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

మంత్రి కేటీఆర్​కు కరోనా పాజిటివ్​

సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ […]

Read More