Breaking News

Day: March 22, 2021

పాలమూరు పచ్చబడాలి.. ప్రాజెక్టు పనులు పరుగులు తీయాలి

పాలమూరు పచ్చబడాలి..

హైదరాబాద్​: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టాలని, డిసెంబరు నాటికి పూర్తికావాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తితో అధికారులు వేగంగా పనులు చేయాలని సూచించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పంపులను జూన్ చివరి నాటికి బిగించాలని, టన్నెల్ పనులు కూడా అప్పటికల్లా పూర్తికావాలని స్పష్టం చేశారు. కాల్వ లైనింగ్ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ప్రగతి […]

Read More
ఉత్సాహంగా పోషణ్​ అభియాన్​

ఉత్సాహంగా పోషణ్​ అభియాన్​

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ్​ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్​ వాడీ సెంటర్లలో సెంటర్లలో పెద్దశంకరంపేట గ్రామంలో పోషణ అభియాన్ కార్డులు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సుక్కమ్మ, అనురాధ అంగన్​వాడీ ఆయాలు పాల్గొన్నారు. వడ్డెర కాలనీ సెంటర్​లో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అంగన్​వాడీ టీచర్ అనురాధ, ఆయా పాల్గొన్నారు.

Read More
పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపికబురు ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి.. త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలు మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్​ సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.పీఆర్సీలో 30శాతం ఫిట్​మెంట్​ ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలు ఆలస్యమైందని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర […]

Read More
ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

ఎమ్మెల్సీ సంబరాల్లో తుపాకీ కలకలం

హైదరాబాద్​: నల్లగొండ, హైదరాబాద్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్​రెడ్డి, సురభి వాణీదేవి ​ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ ​శ్రేణుల సంబరాల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్ ​కప్పుకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం టీఆర్ఎస్ ​నేత ఒకరు తుపాకీతో హల్​చల్​ సృష్టించాడు. ఆ పార్టీలో యూత్​వింగ్ ​లీడర్​ కట్టెల శ్రీనివాస్ ఒక్కసారిగా తుపాకీ తీసి పైకి ఎత్తిపట్టడంతో సమీపంలోని కార్యకర్తలు, నాయకులు హతాశులయ్యారు. వెంటనే తుపాకీని దాచిపెట్టాడు. […]

Read More
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు

హైదరాబాద్​: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వారిని ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, […]

Read More
ఆత్మీయత పంచిన వేడుక

ఆత్మీయత పంచిన వేడుక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉన్నత పాఠశాల 2008-09 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం చిన్నశంకరంపేట శ్రీనివాస గార్డెన్​ లో ఉపాధ్యాయులతో కలిసి వారి మధురానుభూతులను పంచుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఒకరికి ఒకరు ఒకే చోట కలవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, జాన్​ వెస్లీ, బాలేశం, నర్సింగరావు, […]

Read More