Breaking News

Day: February 26, 2021

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

సారథి న్యూస్​, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు

Read More
మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్​పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. […]

Read More
5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం వెలువరించారు. కేరళలో 140, అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే […]

Read More
చీకుపల్లిలో దోమతెరల పంపిణీ

చీకుపల్లిలో దోమతెరల పంపిణీ

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చీకుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం సుమారు 189 దోమ తెరలను పంపిణీ చేశామని డాక్టర్ యమున తెలిపారు. మలేరియా రాకుండా గ్రామంలో దోమల మందు చల్లినట్లు తెలిపారు. క్రమంలో సబ్ యూనిటీ అధికారి శరత్ బాబు,హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్ర కుమారి, సెక్రటరీ శిరీష, ఆశా కార్యకర్త. అంగన్​వాడీ టీచర్​, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More