Breaking News

Day: February 10, 2021

కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి పాదయాత్ర

కల్వకుర్తికి చేరిన రేవంత్​రెడ్డి యాత్ర

సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్​, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన […]

Read More
అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

అడవి పందుల భయం ఉంటే ఫిర్యాదు చేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట రైతువేదికలో రైతుబంధు సమితి క్యాలెండర్లను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఇన్​చార్జ్ ​వ్యవసాయాధికారి అమృత్ మాట్లాడుతూ.. పంటల మార్పిడిలో భాగంగా రైతు సోదరులు అపరాల పంటలైన మినుములు, పెసళ్లు, నూనెగింజల పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు పూలు వంటి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. పంటలకు అడవి పందుల భయం ఉన్నట్లయితే ఆ గ్రామసర్పంచ్​కు ఫిర్యాదు చేయాలని, శిక్షణ ఉన్న షూటర్ సహాయంతో అడవి పందులను చంపివేస్తామని తెలిపారు. […]

Read More
నల్లగొండ గోసవడ్డది

నల్లగొండ గోసవడ్డది

ఫ్లోరైడ్​ బాధితులను ఎవరూ పట్టించుకోలేదు ఇంటింటికీ నీళ్లిచ్చి వారి బాధలు తీర్చినం గోదావరి నీటితో జిల్లారైతుల కాళ్లు కడుగుతం బీజేపీ వారు సంస్కారం నేర్చుకోవాలి సహనానికి కూడా హద్దు ఉంటది.. టైం వస్తే తొక్కిపడేస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, నల్లగొండ: అనాదిగా నల్లగొండ జిల్లా నష్టాలు, కష్టాలకు గురైందని, ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యపాలకులు చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ​డ్యాం ఏలేశ్వరం […]

Read More
అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్​మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం […]

Read More