సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ సూచించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపారు. ఇది భక్తులకు ఎంతో […]
సారథి న్యూస్, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ ఎస్సై రమాదేవి కథనం మేరకు.. గద్వాల పట్టణం హాట్కర్ వీధిలో నివసించే ఓ బాలుడు రెండు రోజులుగా సెల్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు వినకుండా గేమ్స్ ఆడుతుండడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు ఇంట్లోని ఫ్యాన్‌కు […]
సారథి న్యూస్, మెదక్: దివ్యాంగులు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారాలు స్థాపించుకుని స్థిరమైన ఆదాయం పొంది సాధారణ జీవనాన్ని గడపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకంలో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరం దివ్యాంగులు 24 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.13.6 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో 19 […]
సారథి న్యూస్, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విలేకరులకు వెల్లడించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కిడ్నాప్ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్ ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేసి, వైద్యపరీక్షల కోసం గాంధీ […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. మెదక్ పట్టణం, చిన్నశంకరంపేట, మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు కేక్‌లు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సేఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం […]
సారథి న్యూస్, హుస్నాబాద్: బీజేవైఎం రాష్ట్ర నాయకులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టుల చేయాలని మద్దూర్ బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ భిక్షపతి నాయక్ డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా బుధవారం పలువురు బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అశ్లీల చిత్రాలతో ఇటీవల విడుదలైన ‘డర్టీహరీ’ అనే అశ్లీల చిత్రాన్ని బ్యాన్ చేయాలని నిరసన వ్యక్తంచేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ పై కొందరు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని మండల […]
సారథి న్యూస్, వంగూరు: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండిచింతపల్లిలో నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల విద్యాలయం పూర్వవిద్యార్థి రామచంద్రం నిర్వహిస్తున్న హోటల్‌ను కూల్చివేసిన అదే గ్రామ సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ నాయకుడు బత్తిని రవీందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్(ఏఐసీఎస్ వో) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరితో కలిసి బాధితుడు రామచంద్రంను […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అఖిల భారత నవోదయ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములును బుధవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి మాట్లాడుతూ.. 2004 జనవరికి ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘకాలంగా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో […]