అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోండి ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు సారథి న్యూస్, హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండేలా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ‘వ్యవసాయేతర ఆస్తులు.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్ కు అనుసరించాల్సిన పద్ధతులపై’ ఆదివారం ప్రగతి […]
తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జరీనా వహాబ్, నందితాదాస్, ప్రియమణి, […]
లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా యాక్టింగ్ తో మెప్పిస్తుంటారు హీరోయిన్స్. మరింత మెప్పు పొందాలని..అలాగే తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవాలనే క్యూరియాసిటీతో.. ఇప్పటికే చాలామంది నార్త్ హీరోయిన్స్ తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ‘అఆ’ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మలయాళీ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ కూడా తెలుగు మాట్లాడడం బాగానే నేర్చుకుంది. అయితే తెలుగు రాయడం కూడా నేర్చుకోవాలనుకుంటుందట. అందుకోసం స్పెషల్ ప్రాక్టీస్ చేస్తోంది ‘కొత్త టార్గెట్ ను ఇప్పుడే మొదలుపెట్టాను, […]
ఏడాది క్రితం తెలుగులో ‘ఎవరు’తో బంపర్ హిట్ కొట్టిన రెజీనా కొన్నాళ్లుగా తమిళ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. విశాల్ తో ‘చక్ర’ మూవీలో నటిస్తోంది. సందీప్ కిషన్ తో ‘కసడతపర’.. డైరెక్టర్ కార్తిక్ రాజు తీస్తున్న బైలింగ్వల్ మూవీ తమిళంలో ‘శూర్పణగై’, తెలుగులో ‘నేనే నా’ గా రానున్న ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో.. ఇలా వరుస చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితమే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నెన్జమ్ […]
న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి జరిగి ఆదివారంతో 19 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో నాటి ముష్కరుల దుశ్చర్యను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పార్లమెంట్‌పై దుండగుల దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌చేశారు.2001 డిసెంబర్13న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్ […]
సారథి న్యూస్, వరంగల్లు: వరంగల్లులో ప్రతి డివిజన్ సర్వాంగసుందరంగా కనిపించాలని, నగరం అద్దంలా మెరిసేలా సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారులు అభివృద్ధిలో రాజీ పడొద్దని ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండని సూచించారు. ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు ఆఫీసులో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమావేశంలో వరంగల్ […]
సారథి న్యూస్, నల్లగొండ: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాప సభను ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50వేల మేర ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీచేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి […]