సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మృతుల వివరాలు:మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్సొహైల్(18), […]
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటుందని […]
న్యూఢిల్లీ: అన్‌లాక్-6.0 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను మరోనెల రోజులు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్ల బయట… దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్రాలు లాక్డౌన్విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. […]