Breaking News

Day: September 22, 2020

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, బిజినేపల్లి: కోవిడ్ 19 విధులు నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎండీ పసియోద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. డ్యూటీలో ఉండి కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ.కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 10శాతం ఇన్​సెంటివ్ ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్​చేయాలని, 108 సర్వీసులో పనిచేస్తున్న సిబ్బందికి […]

Read More
బిజినేపల్లి గురుకులాన్ని ఇక్కడే కొనసాగించండి

బిజినేపల్లి గురుకులాన్ని ఇక్కడే కొనసాగించండి

సారథి న్యూస్, బిజినేపల్లి: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్​లోని ఆయన చాంబర్​లో కలిశారు. బిజినేపల్లి గురుకులాన్ని వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూలులో తరగతి గదులతో పాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్ బిల్డింగ్ ఎక్స్​టెన్షన్ ​పనులు పూర్తయ్యాయని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన మండలంలో విద్యావ్యవస్థ ప్రతిష్ట […]

Read More
మావోయిస్టుల కదలికలపై డ్రోన్​ నిఘా

మావోయిస్టుల కదలికలపై డ్రోన్​ నిఘా

అసిఫాబాద్​: ఆసిఫాబాద్‌ కొమురంభీం జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు మరింత నిఘాపెంచారు. మావోయిస్టు రాష్ర్ట క‌మిటీ స‌భ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ ల‌క్ష్యంగా కూంబింగ్ చేపడుతున్నారు. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్నారు. పెంచ‌క‌ల్‌పేట […]

Read More
సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం సస్యశ్యామలం

సారథి న్యూస్, హైదరాబాద్: మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా సీతారామ ప్రాజెక్టును విస్తరించే పనులపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును ఒకేసారి పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్​ […]

Read More
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More
ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

గూగుల్‌పై మండిప‌డిన పేటీఎం న్యూఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గ‌త‌వారం భార‌త్‌కు చెందిన చెల్లింపుల యాప్ పేటీఎంను తొల‌గించిన గూగుల్‌పై ఆ సంస్థ తీవ్రఆరోప‌ణ‌లు చేసింది. భార‌త్‌లో చ‌ట్టాల‌ను అతిక్రమిస్తూ.. ఇక్కడ డిజిట‌ల్ ఎకో సిస్టమ్‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని గూగుల్‌ చూస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పేటీఎం బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఒక స్టార్ట్​ప్​గా దేశంలో చ‌ట్టాల‌కు లోబ‌డి మేము వ్యాపారాలు చేస్తున్నాం. కానీ గూగుల్‌, దాని ఉద్యోగులు చేస్తున్న […]

Read More
ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

న్యూఢిల్లీ: ఆరునెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ మ‌ళ్లీ జ‌న‌క‌ళ‌ను సంత‌రించుకోనుంది. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి (17న‌)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేత‌లో భాగంగా.. తాజ్‌మ‌హ‌ల్‌కూ గేట్లు వేసిన విష‌యం తెలిసిందే. ఆరునెల‌ల త‌ర్వాత సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్‌లో ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించారు. అలాగే ఆగ్రా కోట‌నూ సంద‌ర్శించ‌డానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మ‌హల్‌లో రోజుకు 5 వేల మందిని (మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు 2,500.. త‌ర్వాత మిగిలిన‌వాళ్లు) ఆగ్రా కోట‌లో రోజుకు […]

Read More
అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

అక్కన్నపేట బీజేవైఎం అధ్యక్షుడిగా కార్తీక్

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండలాధ్యక్షుడిగా కొయ్యడ కార్తీక్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పదవి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్క్షతలు తెలిపారు. కార్తీక్ ఎన్నిక పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్​ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ సీనియర్ […]

Read More