Breaking News

Day: September 13, 2020

పనుల్లో జాప్యం.. నగరవాసులకు ప్రాణసంకటం

పనుల్లో జాప్యం.. ప్రాణసంకటం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో డ్రైనేజీ గుంతలు పిల్లలు ప్రాణసంకటంగా మారాయని నేషనల్ ఉమేష్ పార్టీ అధ్యక్షురాలు హసీనాబేగం అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరమ్మతులు పనుల్లో జాప్యం ద్వారా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తవ్విన గుంతలను పూడ్చివేయాలని సూచించారు. కాలనీవాసులు పలు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.

Read More
వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

వక్ఫ్‌బోర్డు భూములు అమ్మేశారు

సారథి న్యూస్​, కర్నూలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం పాలకుల కక్కుర్తి కారణంగా ఓ వర్గానికి చెందిన వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల్లో భాగంగా వక్ఫ్‌బోర్డు భూములు పరిరక్షణకు కృషిచేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాకు గురయ్యాయని ఫిర్యాదు అందడంతో ఆదివారం ఏపీ వక్ఫ్‌బోర్డు సీవో ఆలీబాషాతో కలిసి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌, […]

Read More
మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

సారథి న్యూస్, కర్నూలు: మహిళ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేసిందని మెప్మా సిటీ మిషన్‌ మేనేజర్‌ మురళి అన్నారు. ఆదివారం నగరంలోని ముజాఫర్‌ నగర్‌లో వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిలోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినమాట ప్రకారం వైఎస్సార్‌ ఆసరా నిధు సమకూర్చడం సంతోషించదగ్గ విషయమని, వనితలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా, జగనన్న అమ్మఒడి, […]

Read More
ఘనంగా పల్లకీ సేవ

ఘనంగా పల్లకీ సేవ

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తగిన జాగ్రత్తలతో భౌతికదూరం పాటిస్తూ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించామని ఈవో రామారావు తెలిపారు.

Read More
అద్భుతంగా గుట్ట అభివృద్ధి

అద్భుతంగా ‘గుట్ట’ అభివృద్ధి

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి అభివృద్ధి అత్యంత సుందరంగా ఉండేలా ఆలయ నిర్మాణపనులు పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కావునా ఎక్కడా తొందరపాటు లేకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని […]

Read More

మరోసారి.. ఎయిమ్స్​లో చేరిన అమిత్​ షా

ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్​ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్​కు తరలించారు. ఆగస్టు 2న అమిత్​ షాకు కరోనా పాటిజివ్​ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్​లో […]

Read More

వోటింగ్​లో వీక్​.. సూర్యకిరణ్​ అవుట్​

బిగ్​బాస్​- 4 హౌస్​ నుంచి ఫస్ట్ బయటకు వెళ్లేది తమిళదర్శకుడు సూర్యకిరణే అని సమాచారం. ఎలిమినేషన్​కు నామినేట్​ అయిన వాళ్లలో అతి తక్కువ మార్కులు ఉండటంతో బిగ్​బాస్​ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి బిగ్​బాస్​లో చాలా మంది కొత్తమొఖాలు కావడంతో ప్రేక్షకులు కూడా చాలా బోర్​గా ఫీలవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఇద్దరు కమెడియన్లు హౌస్​లోకి వైల్డ్​కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హౌస్​లో చాలామందికి తెలుగు మాట్లాడకపోవడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడుతున్నారట. ప్లాప్​ […]

Read More
తెలంగాణలో 2,216 కేసులు

తెలంగాణలో 2,216 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు […]

Read More