సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్ షాక్కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ […]
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీ వరద నీరు వచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు ఐదు షట్టర్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో బుధవారం రాత్రి భారీవర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు వచ్చే కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి నీటి ఉధృతి బాగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ముందస్తు చర్యగా అధికారులు ప్రాజెక్టు […]
ప్రపంచమంతా ఆధునికత వైపు ముందుకెళ్తుంటే.. కాయకష్టాన్ని నమ్ముకున్న వలస కూలీ మాత్రం ఓ పూట తిండి కోసం ఇప్పటికీ అల్లాడుతున్నాడు. ఇలాంటి కన్నీటి గాథలను కథలు కథలుగా వింటూనే ఉన్నాం. అయితే ఈ బక్కపల్చటి బతుకుల్లో అంతకుమించిన ఆవేదనను మిగిల్చింది కరోనా. మరీ ముఖ్యంగా మహిళలకు మనసు చెలించే కథలనే రాసింది. కాలం చేసిన గాయాల్లో ఎందరో ఆడ కూతుళ్ల కన్నీటి బొట్లకు ఇవి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. రూ.లక్షలు, రూ.కోట్లు సంపాదించాలని కలలో కూడా కోరుకోని […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) 2,817 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చేరిన కరోనా సంఖ్య 1,33,406కు చేరింది. తాజాగా వ్యాధిబారినపడి 10 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య 856కు చేరింది. వ్యాధి నుంచి తాజాగా 2,611 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013 కు చేరింది. ప్రస్తుతం 32,537 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్లో 25,293 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 452 కేసులు నమోదయ్యాయి. ఇలా జిల్లాల […]