Breaking News

Day: August 27, 2020

నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

నన్ను ఇరికించారు.. ఎవర్నీ వదలను

సారథి న్యూస్​, హైదరాబాద్​: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్​ ప్రదీప్ స్పందించారు.​ సోషల్​మీడియా, కొన్ని వెబ్​సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్​ ప్రదీప్​ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ ​మీడియాలో యాంకర్​ ప్రదీప్​పై పెద్ద ఎత్తున ట్రోలింగ్​ నడిచింది. దీంతో […]

Read More
గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేశ్​ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్​, కర్నూలు: కర్నూలు నగరంలో ఈనెల 30న జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం, పోలీస్, ఫిషరీస్, విద్యుత్ అధికారులు, నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులతో కలిసి వినాయక్ ఘాట్ ను పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్ వద్ద ఉన్న మెట్లకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. కమిషనర్ […]

Read More
‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్​డౌన్​సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్​ప్రకాశ్​ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.

Read More
ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం బాబు నైజం

ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం బాబు నైజం

సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులు, ఇళ్లపట్టాల పంపిణీ, కర్నూలులో న్యాయరాజధాని.. తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నిరసిస్తూ బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్​సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్​ఖాన్​పాల్గొన్నారు. చంద్రబాబు కేవలం అమరావతి పేరుతో ఆ ప్రాంతంలో తన బినామీలు, సొంత […]

Read More
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాపసభను గురువారం స్థానిక సీకేఆర్ ​గార్డెన్స్​లో నిర్వహించారు. నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్​ ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్​రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్​ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, మాజీమంత్రి చిత్తరంజన్​దాస్​, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ […]

Read More

‘ఆచార్య’ కథ నాది.. కాదు మాదే

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ చిత్ర కథపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ కథ తనదేనంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన రాజేశ్​ మండూరి అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హాట్​ టాపిక్​గా మారింది. ఈ విషయంపై సోషల్​మీడియాతోపాటు.. మెయిన్​ స్ట్రీమ్​ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. తన కథను కొరటాల శివ కాపీ కొట్టి ఆచార్యగా తెరకెక్కిస్తున్నారని రాజేశ్​ ఆరోపించారు. ‘ నేను […]

Read More
రైతుబంధు, రైతుసమితి భేష్​

రైతుబంధు, రైతుసమితి భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ ఫండ్ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. దేశ వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమచేసి వాడుకుంటుందని వివరించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిరాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రి టి.హరీశ్​రావు […]

Read More