Breaking News

Day: August 15, 2020

ఇంటర్​నేషనల్​ క్రికెట్​కు ధోనీ గుడ్​బై

ఇంటర్​నేషనల్ ​క్రికెట్​కు ధోనీ గుడ్ ​బై

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ఆటగాడు, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా శనివారం అనూహ్య నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఎంఎస్‌ ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు. 2004లో టీమిండియా జట్టులోకి అరంగ్రేటం చేశాడు. డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. 2005, డిసెంబరు 2న శ్రీలంకతో […]

Read More
వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

సారథి న్యూస్, హుస్నాబాద్: వాగు నీటిలో కొట్టుకుపోయిన లారీడ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. చివరికి ఆచూకీ లభించకపోడంతో వెనుదిరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున వరంగల్లు వైపునకు లారీ(టీఎస్ 02 యూబీ 1,836) వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముదిమడక శంకర్(37) ఎప్పటిలాగే వెళ్లేందుకు ప్రయత్నించగా లారీ ఒక్కసారిగా […]

Read More
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

సారథి న్యూస్, వాజేడు: 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వాజేడు నాగారం పంచాయతీలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సెక్రటరీ అశోక్, పెనుగోలు కాలనీలో అంగన్​వాడీ టీచర్ నాగలక్ష్మి, మల్లక్క, పెద్దగొళ్లగూడెంలో సర్పంచ్ మేనక, సెక్రటరీ శిరీష, మెురుమూరులో పూసం నరేశ్, సెక్రటరీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు […]

Read More
కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

కష్టకాలంలోనూ రైతులను ఆదుకున్నాం

సారథి న్యూస్, మెదక్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా రాష్ట్రంలో రైతులకు రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్ కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో 24 […]

Read More
భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్​రోడ్డులో నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]

Read More
వాగులో చిక్కినవారు సేఫ్​

చలివాగులో చిక్కినవారు సేఫ్​

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం వ్యవసాయ బావి మోటార్లను తీసుకొచ్చేందుకు వాగులోకి వెళ్లిన రైతులు అందులోనే చిక్కుకున్నారు. తక్షణం స్పందించిన మంత్రి కె.తారక రామారావు రెండు ఎయిర్ ఫోర్స్ ​హెలిక్యాప్టర్లను పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారు క్షేమంగా బయటికిరావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రవబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి […]

Read More

హీరో రామ్​ ట్వీట్​.. వైఎస్సార్సీపీ మండిపాటు

  • August 15, 2020
  • Comments Off on హీరో రామ్​ ట్వీట్​.. వైఎస్సార్సీపీ మండిపాటు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్​రెడ్డిపై సినీహీరో రామ్​ పొతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రామ్​ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్​ సెంటర్​గా ఉన్న విజయవాడలోని స్వర్ణప్యాలెస్​లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందారు. కాగా రమేశ్​ హాస్పిటల్​కు చెందిన కరోనా పేషెంట్లను.. హోటల్​ స్వర్ణప్యాలెస్​లో ఉంచి వారికి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఏపీప్రభుత్వం ఉన్నతస్థాయి […]

Read More
ఏపీలో 8,732 కరోనా కేసులు

ఏపీలో 8,732 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. తాజాగా 87మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి దాకా మృతుల సంఖ్య 2,562కు చేరింది. మొత్తం 53,712 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 88,138గా నమోదైంది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.

Read More