Breaking News

Day: August 1, 2020

మీ త్యాగాలు వృథా కావు

మీ త్యాగాలు వృథా కావు

టీఆర్​ఎస్​ కార్యకర్తలను ఆదుకుంటాం ఎమ్మెల్యేలూ.. వారికి అండంగా ఉండండి సమావేశంలో మంత్రి కె.తారక రామారావు ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్లు డిపాజిట్​ సారథి న్యూస్, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల శ్రమ, పట్టుదల, త్యాగాలు వృథాకాదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కె.తారక రామారావు అన్నారు. వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ ప్రతి కార్యకర్తకు రూ. రెండు […]

Read More
5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

5న తెలంగాణ కేబినెట్ మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఆగస్టు 5న (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
గుంజన్ సక్సేనా @ది కార్గిల్ గర్ల్

గుంజన్ సక్సేనా @ ది కార్గిల్ గర్ల్

లెజెండరీ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్​గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వి యుద్ధ పైలెట్గా కనిపిస్తుంది. భారతదేశపు తొలి మహిళా ఐఏఎఫ్ పైలెట్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలెట్​గా ‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతికెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో […]

Read More
ప్రియుడితో కలిసి నయనతార తీర్థయాత్రలు

ప్రియుడితో కలిసి నయన్​ తీర్థయాత్రలు

దక్షిణాది స్టార్​ హీరోయిన్​ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్​ శివన్​తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్​సైట్లు, సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్​, విఘ్నేశ్​పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ […]

Read More
జెర్సీకి అంతర్జాతీయ గుర్తింపు

‘జెర్సీ’కి అంతర్జాతీయ గుర్తింపు

యువహీరో నాని, శ్రద్ధా శ్రీనిథ్​ జంటగా నటించిన జెర్సీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కెనడాలోని టోరంటలో జరిగే ఫిలిం ఫెస్టివల్​లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. తమ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి పేర్కొన్నారు. ఆగస్టు 9 నుంచి, 15 వరకు టోరంటోలో ఫిలిం ఫెస్టివల్​ నిర్వహించనున్నారు. క్రికెట్ నేపథ్యంతో నాని, శ్ర‌ద్ధాశ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ జెర్సీ చిత్రాన్ని నిర్మించింది.గౌతమ్​ తిన్నసూరి ఈ చిత్రానికి […]

Read More
మెదక్​ జిల్లాలో వేగంగా

పంట వివరాలు పక్కాగా

సారథిన్యూస్​, నిజాంపేట: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులు ఏయే పంటలు సాగుచేశారో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటవివరాలు నమోదు చేసుకుంటున్నారు. మెదక్​ జిల్లాలోనూ ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే 95 శాతం పంటనమోదు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్​ చేసుకొనేందుకు ఇబ్బందులు పడకుండా ముందుగానే పంటవివరాలు […]

Read More
శేఖర్​ కమ్ముల

శేఖర్​ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్​ బన్సీలాల్​ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్​ కమ్ములకు ఫోన్​ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్​స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తయినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

Read More
పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్దసముద్రాల గ్రామంలోని పోచమ్మ గుడిలో ఎలుగుబంటి ప్రవేశించడం ఆసక్తిరేపింది. శుక్రవారం రాత్రి ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలోకి గుడ్డెలుగు ప్రవేశించగానే గ్రామస్తులు గుడిగేట్లను మూసి తాళం వేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుడ్డెలుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు, రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Read More