Breaking News

Month: July 2020

పోలీసులకు హెల్త్​కిట్​

పోలీసులకు హెల్త్​కిట్​

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా బారినపడిన 44 మంది పోలీస్​కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి హెల్త్​కిట్లు ఆదివారం పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇలాంటి హెల్త్ కిట్స్ పంపిణీ చేసిన ఎస్పీకి పోలీసులు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పోషకాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలని ఎస్పీ సూచించారు.

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

అన్నివర్గాలకు సంక్షేమఫలాలు

సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్​ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్​ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు […]

Read More

రైజింగ్ సన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

సారథిన్యూస్, రామడుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని యువజన సంఘం సభ్యులు చెప్పారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట శివారులో రైజింగ్​ సన్​ యువజనసంఘం సభ్యులు స్వచ్ఛ భారత్​ నిర్వహించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా, చెదారం తొలిగించారు. కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు గజ్జెల అశోక్, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేశ్​, గజ్జెల నవీన్, ప్రశాంత్, రాజు కుమార్ పాల్గొన్నారు.

Read More

పేదలబియ్యం పక్కదారి

సారథిన్యూస్​, కోడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ రేషన్​డీలర్​ భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోడేరు మండల కేంద్రంలోని రేషన్​షాప్​నెంబర్​ 3 డీలర్​ శారద భర్త శ్రీనివాసులు 95 కిలోల బియ్యాన్ని దారి మళ్లించాడు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పౌరసరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని డీలర్ ను అదుపులోకి తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు.

Read More
‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్‌ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]

Read More
గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు

గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు

జైపూర్‌‌: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్‌ గెహ్లాట్‌ గవర్నర్‌‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్‌ గవర్నర్‌‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్‌ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు […]

Read More
‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ చేసేందుకు పర్మిషన్‌ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఎయిస్‌ ఎథిక్స్‌ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి ఉండగా, […]

Read More
చైనాను దెబ్బకొట్టేందుకు ఇలా

చైనాను దెబ్బకొట్టేందుకు ఇలా

న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌‌ పోలీస్‌(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్‌ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్‌ కోర్సును నేర్పిస్తున్నారు. మన సైనికులు మాండరిన్‌ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, […]

Read More