Breaking News

Month: July 2020

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్​తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి […]

Read More

మరో ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానందగౌడ్​కు కరోనా సోకినట్టు సమాచారం. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. లక్షణాలు కూడా ఎక్కువగా లేవని […]

Read More
ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్​ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.

Read More
కోలీవుడ్ కు కియారా

కోలీవుడ్ కు కియారా

‘ఫగ్లీ’మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ‘ఎమ్ఎస్ ధోని’ మూవీతో అక్కడ, ‘భరత్ అను నేను’తో తెలుగునాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్​గా ‘కబీర్ సింగ్’తో మరింత స్టార్ డమ్ మూటగట్టుకుంది. దాంతో కియారా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తన అందాలతో కిక్ ఎక్కించిన కియారా ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం అందిబుచ్చుకుందని ప్రచారం […]

Read More
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్‌లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్​ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్​పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, […]

Read More
పోలీస్ స్టేషన్​కు అలీ

పోలీస్ స్టేషన్​కు అలీ

టాలీవుడ్ ప్రఖ్యాత కామెడీ నటుడైన అలీ కొద్దిరోజులుగా ఫేస్​బుక్, ట్విట్టర్​లో తాను పెట్టని కమెంట్ల గురించి ఆశ్చర్యంలో ఉన్నారు. అందరూ ఆ ట్విట్టర్ అలీదే అనుకున్నారట కూడా. వాటి వల్ల తను ఇబ్బందులకు గురవుతున్నాడట. ‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం, గుణం, వర్ణం గురించి మాట్లాడతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..’ అని అలీ పేరుతో ఓ ట్వీట్ రాగా.. దానికి ప్రతిగా ప‌వ‌న్ […]

Read More
తెలంగాణలో 1,296 కేసులు

తెలంగాణలో 1,296 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 45,076 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. రికవరీ అయిన వారి సంఖ్య 30,607కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు 409 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 557 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 111, మేడ్చల్​87, సంగారెడ్డి 28, కామారెడ్డి 67, వరంగల్​ అర్బన్​117, […]

Read More
కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా క్యాపిటల్‌గా మార్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్​ఎద్దేవా చేశారు. గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ చేసినట్లు ప్రాంతీయ కోవిడ్‌ ఆస్పత్రులుగా ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిగా కర్నూలు సర్వజన ఆస్పత్రిని మార్చారని, నగరం నడిబొడ్డున ఆస్పత్రి ఉన్నందున వైరస్‌ ప్రజకు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కోవిడ్‌ ప్రాంతీయ […]

Read More