Breaking News

Month: July 2020

చరణ్, వెంకీ.. సినిమా

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు […]

Read More

‘ఉస్మానియా’ పురావస్తు భవనం కాదా?

సారథి న్యూస్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని […]

Read More
తమిళనాడు రాజ్​భవన్​లో 84 మందికి కరోనా

రాజ్​భవన్​లో 84 మంది కరోనా

చెన్నై: తమిళనాడు గవర్నర్​ అధికారిక నివాసం రాజ్​భవన్​లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్​భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్​ బన్వర్​లాల్​ పురోహిత్​ను కాంటాక్ట్​ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Read More

సచిన్​పైలట్​కు ఊరట

ఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్​ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్​ పైలట్​ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్​ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని […]

Read More
వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు […]

Read More
జూరాల లింక్ కెనాల్ కు గండి

జూరాల లింక్ కెనాల్ కు గండి

సారథిన్యూస్​, మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి చిన్న ఆముదాలపాడు మధ్యన ఉన్న జూరాల లింక్ ఆర్​ డీఎస్​ ప్రధాన కాల్వకు భారీ గండి పడింది. దీంతో రెండు రోజులుగా పంటపొలాల్లో కాలువ నీరు ప్రహిస్తుండంతో పొలాలు ఆగమవుతున్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ కాలువ పరిస్థితి ఇదేవిధంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రధాన కాలువలో సీల్టు తీయకపోవడం వల్లే ఈ గండ్లు ఏర్పడుతున్నాయని సమీప బాధిత […]

Read More

భోపాల్​లో సంపూర్ణ లాక్​డౌన్​

భోపాల్​: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాలు, కూరగాయలు, రేషన్​ దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్టు హోంమంత్రి నరోత్తం మిశ్రా ప్రకటించారు. ఈ నెల 24 (శుక్రవారం) నుంచి 10 రోజులపాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Read More
శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

సారథి న్యూస్​, శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్​లోకి ఇన్‌ఫ్లో 56,614 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 848.70 అడుగులుగా నమోదు అయ్యింది.ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 77.1732 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహంతో […]

Read More