Breaking News

Month: July 2020

ఉసా మరణం తీరనిలోటు

ఉసా మరణం తీరనిలోటు

సారథిన్యూస్​, ఖమ్మం: బహుజన ఉద్యమకారుడు ఉ. సాంబశివరావు మరణం తీరని లోటని టీజేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్​ కేవీ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​ ఎదుట ఉసా చిత్రపటానికి నివాళి అర్పించారు. సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో ఉసా పాత్ర మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎం​ఎల్​ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు అశోక్ ఝాన్సీ, ప్రజా సంఘాల నాయకులు బీవీ రాఘవులు, లిక్కి కృష్ణరావు, పాల్వంచ రామారావు, హనుమతురావు దాసరి శ్రీనివాస్, నరేందర్, మధు […]

Read More
కండల వీరుడిగా నాగశౌర్య

కండలవీరుడిగా నాగశౌర్య

‘అశ్వత్థామ’ సినిమాతో రఫ్ హీరోగా దర్శనమిచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు లుక్ ను మరింత రఫ్ చేశాడు. తన కెరీర్​లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య చేసిన వర్క్​అవుట్స్ తన లుక్​, కటౌట్​ను మార్చేశాయి. ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటుచేసుకుని కఠోర వ్యాయామాలు చేశాడు. వావ్ అనిపించుకునే కండలు తిరిగిన దేహంతో అభిమానులను అబ్బురపరిచాడు. ‘ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అంటూ ఈ చిత్రంలో నాగశౌర్యకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేసింది […]

Read More
‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అప్​డేట్​

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కేజీఎఫ్’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాదు దేశవ్యాప్తంగా అందరిచూపులను మూవీ సీక్వెల్ వైపు తిప్పుకుంది. మొదట ఈ సీక్వెల్ విడుదల ఈ ఏడాది అక్టోబర్‌లో అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వర్క్ కు బ్రేక్ పడడంతో ప్రకటించిన తేదీకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కొత్త అప్ డేట్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న […]

Read More
ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు

అతి తక్కువ టైమ్​లోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ (షామ్నా ఖాసిమ్). అయితే ఈ కేరళ ముద్దుగుమ్మ రీసెంట్​గా ఓ ఫ్రాడ్ గ్యాంగ్ ట్రాప్​లో ఇరుక్కుంది. సినిమాల్లో బాగా గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఫిక్సయింది. పెళ్లి సంబంధం వచ్చింది. ఇరువర్గాలూ మాట్లేడుసుకున్నారు కూడా. ఇక పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అనుకుంటున్నారట. అయితే ఇంతలో పూర్ణకి ‘మాకు డబ్బులివ్వు.. లేదా నీ వీడియోలు నెట్​లో షేర్ చేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయంట. ముందు పూర్ణ […]

Read More
ఆగస్టులోనైనా బొమ్మ పడేనా.. ?

ఆగస్టులోనైనా బొమ్మ పడేనా..?

కరోనా మహమ్మారి‌, తదనంతర లాక్‌ డౌన్‌ పరిస్థితులు సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు. థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని నిబంధనలతో చిత్రీకరణలకు ఇటీవల అనుమతి లభించినప్పటికీ. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే వాటికి కూడా అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆగస్టులో సినిమా థియేటర్లను తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. హోంశాఖకు సిఫార్సు చేసింది. సీఐఐ మీడియా కమిటీ సమావేశంలో ఐ అండ్‌ బీ కార్యదర్శి అమిత్‌ ఖారే […]

Read More
ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

సారథి న్యూస్​, కృష్ణా: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం […]

Read More
సీఎం జగన్​కు కన్నా లేఖ

సీఎం జగన్​కు కన్నా లేఖ

సారథి న్యూస్​, అమరావతి : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ఉపాధికి గండి పడకుండా చూడాలని లేఖలో డిమాండ్ చేశారు. డీలర్లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని, స్వయం ఉపాధి కింద వారంతా రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా సరకులు ఇంటికి […]

Read More
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

సారథి న్యూస్​, అమరావతి : సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్​ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్ లు, నియోజకవర్గ స్థాయిలో 147 అగ్రి ల్యాబ్ లు, రాష్ట్ర స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, […]

Read More