Breaking News

Month: July 2020

ఐశ్వర్య ఆమె కూతురు డిశ్చార్జి

కరోనాను జయించిన ఐష్, ఆరాధ్య​

ముంబై: మాజీ మిస్​ వరల్డ్​ ఐశ్వర్యా రాయ్​ బచ్చన్​, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబంలో జ‌యాబ‌చ్చ‌న్ మిన‌హా మిగిలిన కుటుంబస‌భ్యులు అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్​ బచ్చన్​ ట్వీట్​ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]

Read More
దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

దూరదర్శన్‌ లైవ్‌లో భూమిపూజ!

సారథి న్యూస్​, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే పూజా కార్యక్రమాలను వీక్షించాలని కోరింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను పిలవాలనే యోచనలో ఉన్నట్టు ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి అన్ని మతాల ప్రజల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు ట్రస్టు సభ్యుడు, […]

Read More
షార్ట్ న్యూస్

తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

సారథి న్యూస్​, హైదరాబాద్​ : తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కాగజ్ నగర్ ఆర్డీవోగా ఆర్ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీవోగా జె.రాజేశ్వర్, తాండూరు ఆర్డీవోగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీవోగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీవోగా టి.రవి, దేవరకొండ ఆర్డీవోగా కె.గోపిరాం, బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీవోగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీవో ఎన్. ప్రసూనాంబ బదిలీ..కాగా రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, […]

Read More

సూర్యాపేట ఆర్డీవో బదిలీ

సారథి న్యూస్​, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read More
జూలై 30నుంచి లాక్​డౌన్​

జూలై​ 30నుంచి లాక్​డౌన్​

సారథి న్యూస్​, నల్లగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ వ్యాపారస్తులతో తన క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 30 నుంచి 14 తేదీ వరకు వ్యాపారస్తులు నల్గొండలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 1 గంటవరకు తెరిచి ఉంచుతారని, ఇంకా మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయించడం జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశంలో చెప్పారు. కరోనా […]

Read More
నితిన్ కు ‘రంగ్​దే’ కానుక

నితిన్ కు ‘రంగ్​దే’ కానుక

యంగ్ హీరో నితిన్ పెళ్లి సాదాసీదాగా ఆదివారం బంధుమిత్రుల సమక్షంలో జరిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నితిన్ కు ‘రంగ్ దే’ టీమ్ క్యూట్ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ తో స్పెషల్ విషెస్ తెలియజేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నిజజీవితంలో ఎంతో […]

Read More

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

సారథి న్యూస్​, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 […]

Read More
హోటల్​కు భారీ జరిమాన

హోటల్​ తనిఖీ.. భారీ జరిమాన

సారథిన్యూస్​, కొత్తగూడెం: కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించని ఓ హోటల్​కు భారీ జరిమాన విధించిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం కలెక్టర్​ ఎంవీ రెడ్డి జిలా కేంద్రంలోని హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ‘గుడ్​మార్నింగ్​’ అనే హోటల్​లో సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా తినుబండారాలు సప్లై చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్​ హోటల్​ యజమానికి రూ. 25వేలు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More