Breaking News

Month: July 2020

టిక్​టాక్​ నిషేధంతో నిరుద్యోగం

కోల్‌కతా: టిక్​టాక్​ మొబైల్​ యాప్​పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్​టాక్​తో సహా మొత్తం 59 యాప్​లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ ​ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన […]

Read More

హైదరాబాద్​లో లాక్​డౌన్​ సరికాదు

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మెగా బ్రదర్​, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రానిక్​ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లాక్​డౌన్​ పెట్టాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం చారిత్రాత్మక తప్పిదం’ అని ఆయన ట్వీట్​ చేశారు. లాక్​డౌన్​తో ఎందరో ఉపాధి కోల్పోతారు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

Read More

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]

Read More

ఖమ్మంలోనే కరోనా పరీక్షలు

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్​ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్​ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ తెలిపారు. […]

Read More

కరోనా నియంత్రణలో ఫెయిల్​

సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్​ పార్టీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: సకాలంలో పనులు పూర్తిచేయకపోతే ఉపేక్షించేది లేదని వరంగల్​ అర్బన్​ కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా లో వైకుంఠ దామాలు, కంపోస్టు ( సెగ్రిగేశాన్) షెడ్లు నిర్మాణా పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరో విడత హరిత హరంలో భాగంగా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామ శివారు ఆయన మాట్లాడారు.

Read More

గుట్టుగా గుట్కా విక్రయాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్​ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More
శుభదినాల్లో మొక్కలు నాటండి

శుభదినాల్లో మొక్కలు నాటండి

సారథి న్యూస్, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్ అన్నారు. బర్త్​డే, పెండ్లి రోజు, ఇతర శుభదినాల్లో మొక్కలు నాటాలని కోరారు. బుధవారం కోహెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించడంతో పర్యావరణం రోజురోజుకు కలుషితమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో సీఐ రఘు, ఎస్సై రాజుకుమార్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More