Breaking News

Month: July 2020

ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ ఫిల్మ్‌

ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ మూవీ

‘పలాస 1978’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రఘు కుంచె. నటుడిగా, సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రఘు కుంచె మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ కొత్త బాటలు వేసుకుంటున్నారు. ‘పలాస 1978’ చిత్రంలోని నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి హీరోగా కనిపించబోతున్నారు. అదీ ఓ పిరియాడిక్ మూవీలో. 1991లో జరిగిన ఓ అన్ టోల్డ్ స్టోరీని ‘కథా నళిని’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. 29 ఏళ్లుగా […]

Read More
వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్‌ దుబేపై పోలీసులు రివార్డు పెంచారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న రివార్డును 2.5లక్షలకు పెంచుతూ యూపీ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హెచ్‌ సీ. అవస్థి ఆదేశాలు జారీచేశారని అడిషనల్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ లా అండ్‌ ఆర్డర్‌‌ ప్రశాంత్‌ కుమార్‌‌ సోమవారం చెప్పారు. నిందితుడిపై ముందు రూ.50వేలు ఉన్న రివార్డును రూ.లక్షకు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు రూ.2.5లక్షలకు […]

Read More
శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

బీజేపీ ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది వికాస్​దుబే పాత ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ ఖండించిన బీజేపీ ఎమ్మెల్యేలు లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడై తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దుబే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తనకు పొటిలికల్‌గా పరిచయాలు ఉన్నాయని, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌‌ హరికృష్ణ శ్రీవాస్తవ తనకు పొలిటికల్‌ గురువు అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. యూపీ మాజీ సీఎం […]

Read More

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More
కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు

కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు

న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి వృద్ధులు, చిన్నారులకు అంటుకుంటే డేంజర్‌‌ అని డాక్టర్లు హెచ్చరిస్తుండగా.. ఢిల్లీకి చెందిన ఈ 106 ఏళ్ల వృద్ధుడు మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నాడు. 70 ఏళ్ల తన కొడుకు కంటే తొందరగా కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌(ఆర్‌‌జీఎస్‌ఎస్‌హెచ్‌)లో చేరిన ఆ పేషంట్‌కు వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తొందరగా రికవరీ అయ్యారని హాస్పిటల్‌ వర్గాలు చెప్పాయి. ఆ వృద్ధుడికి […]

Read More

ఏసీబీ వలలో ఇరిగేషన్​ ఏఈ

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్‌ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]

Read More

హరితహారం.. మహోద్యమం

సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఓ మహోద్యమంలా సాగుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, తల్లపల్లి సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Read More

మద్యం దొంగలు అరెస్ట్​

సారథిన్యూస్​, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్​లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన శేఖర్​, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]

Read More