Breaking News

Day: July 31, 2020

స్వేరోసర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు

స్వేరోసర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.

Read More
తెలంగాణలో 1,986 కేసులు,

తెలంగాణలో 1,986 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 62,703కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 16,796 ఉన్నాయి. జిల్లాల వారీగా..అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 29, జనగాం 21, జోగుళాంబ గద్వాల 32, కామారెడ్డి 46, కరీంనగర్ ​116, ఖమ్మం […]

Read More
వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు

వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు

సారథి న్యూస్​, మెదక్​: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయంలో పూజారులు వనదుర్గామాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Read More
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్​ కార్యకర్తల్లో ఆందోళన రెగ్యులర్​ పరీక్షల నిమిత్తమే.. ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా వెల్లడి న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఆమె రెగ్యులర్ పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. గురువారం (జులై 30) సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే […]

Read More
సాగర్​కు జలకళ

సాగర్​కు జలకళ

సారథి న్యూస్​, నాగార్జునసాగర్‌ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్​గేట్ల లెవల్‌ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్‌ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]

Read More
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కంచిరావుపల్లికి మంత్రి గుడ్ ​న్యూస్​

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ ప్రజలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి గుడ్​న్యూస్​ చెప్పారు. ఆ గ్రామంలో 50 మంది నిరుపేదలకు త్వరలోనే డబుల్​ బెడ్​రూం ఇండ్లు కట్టించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆగస్టు 1న గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్​ సుజాత తేజవర్ధన్​, ఎంపీటీసీ, రైతు సమన్వయసమితి నాయకులు, టీఆర్​ఎస్​ కార్యకర్తలు, గ్రామప్రజలు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు […]

Read More