మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్‌డౌన్‌తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం […]
గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారు. నారాయణదాస్, పుస్కూరి రామ్మోహన్రావు, శరత్ మారార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా గోవాబ్యూటీ ఇలియానా ఎంపికైనట్టు సమాచారం. ఇలియానా టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆమెకు నాగార్జున తన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు దర్శకుడు కూడా ఒప్పుకోవడంతో ఇలియానాకు ఆఫర్ […]
అక్కినేని అఖిల్‌కు టైం కలిసిరావడం లేదు. ఈ యువ హీరో నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వెబ్‌సీరీస్‌లో నటించేందుకు అఖిల్ సిద్ధమవతున్నట్టు టాక్. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ ఈ మూడు చిత్రాలు అఖిల్ ను నిరాశపరిచాయి. అయినప్పటికీ నటుడిగా కొంతమేర గుర్తింపు పొందాడు. డాన్సులు, ఫైట్ సీన్లలో ఎంతో బాగా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ప్రశంసలు గుప్పించారు. కానీ నటనలో కొంత పరిణతి సాధించాలని సినీ విమర్శకుల సూచన. ఈ […]
ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్‌లో తమ క్యాంపస్‌లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్‌లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) కంట్రోల్ చేయనున్నది. […]
ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]
ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్‌కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్ ఓ పోలీస్‌ను రివాల్వర్‌తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా సీవోపీడీ ( క్రానిగ్ అబ్స్క్రక్టివ్ పుల్మోనరీ వ్యాధి)తో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. సోమెన్ కరోనాతో మృతిచెందారన్న వార్తల్లో నిజం లేదని ఆసపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపాయి. సోమెన్ మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్ కేసులున్నాయి.