Breaking News

Day: July 26, 2020

అంబులెన్స్​ ఫీజు తొమ్మిదివేలు

6 కి.మీ.. రూ. 9,000

కోల్‌కతా : కరోనా వైరస్​తో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. కోల్​కతాలో ఆరు కి.మీ.దూరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ అంబులెన్స్​ డ్రైవర్​ రూ.9200 డిమాండ్​ చేశాడు. అంతమొత్తం చెల్లించలేమని చెప్పిన ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలిన బాలురు, వారి తల్లిని అర్ధంతరంగా వాహనం నుంచి దిగిపొమ్మని చెప్పాడు. వైద్యులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు రూ.2,000 తీసుకునేందుకు అంగీకరించాడు. కోవిడ్‌-19గా నిర్ధారణ కావడంతో సోదరులైన ఇద్దరు బాలురు శుక్రవారం […]

Read More
‘సంగంబండ’ నుంచి నీటివిడుదల

‘సంగంబండ’ నుంచి నీటి విడుదల

సారథి న్యూస్, మహబూబ్​నగర్: మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ ఎడమ కాల్వ నుంచి నీటిని శనివారం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జడ్పీ చైర్​ పర్సన్ ​వనజ, నారాయణపేట కలెక్టర్ హరిచందన నారాయణపేట ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్​ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని కొనియాడారు. జిల్లా ఎస్పీ ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ గ్రామాల […]

Read More
బాలీవుడ్​లో డేంజరస్ యాప్​

ఆ గ్యాంగ్​ చాలా డేంజర్​

బాలీవుడ్​లో ఉన్న ఓ డేంజరస్​ గ్యాంగ్​ వల్లే తనకు హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ విన్నర్​ ఏఆర్​ రెహమన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా అవకాశం ఇద్దామనుకున్న వెంటనే ఆ గ్యాంగ్​ ఎంటర్​ అయి తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చీకటి వ్యవహారాలపై ఒక్కొక్కరూ నోరు విప్పుతున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చివరి చిత్రం […]

Read More
ఓకే రోజు 48 వేల కేసులు

48వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. గత 24 గంటల్లో 48,661 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,42,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 62 లక్షల పైచిలుకు పరీక్షలు చేశారు. మొత్తం కేసుల సంఖ్య 13,85,522 కు చేరుకున్నది. 32 వేల మంది మృతిచెందారు. 9 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,67,882 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
దేశమంతా విజయ్​దివస్

దేశమంతా విజయ్ ​దివస్

ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్‌ను కబళించేందుకు పాకిప్తాస్​ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికీ 21 ఏళ్లు. ఈ సందర్భంగా దేశమంతా విజయ్​దివస్​ను జరుపుకుంటోంది. ఏం జరిగిందంటే..ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాకిస్తాన్.. ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరన పంజాకు విలవిల్లాడింది. ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్​లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి […]

Read More
ఔరా.. మధుసూదన్ ఖజానా

ఔరా.. మధుసూదన్ ఖజానా

అందరిలా సాధారణంగా జీవిస్తే అందులో ప్రత్యేకత ఏముంటుంది. భిన్నంగా ఏదైనా చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. అంతకు మించి ఆత్మ సంతృప్తి దొరుకుంది. అచ్చం అలాగే ఆలోచించారు మెదక్ ​జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్​ మధుసూదన్. సారథి న్యూస్, మెదక్: సాధారణంగా టీచర్ల వద్ద పుస్తకాలు ఉంటాయి. కానీ ఆయన వద్ద మాత్రం దేశవిదేశాలకు చెందిన వందల ఏళ్ల నాటి స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల […]

Read More
‘పాలీసెట్‌’ అప్లికేషన్​గడువు పెంపు

‘పాలీసెట్‌’ అప్లికేషన్ ​గడువు పెంపు

హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More
ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా […]

Read More