Breaking News

Day: July 25, 2020

కోవిడ్ 19యాప్ ఆవిష్కరణ

కోవిడ్​ 19యాప్​ ఆవిష్కరణ

సారథి న్యూస్​, మేడ్చల్​ : రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే కోవిడ్19 అనే కొత్త యాప్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఆప్ ద్వారా కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న  పేషంట్ తో వీడియో కాల్ లో వైద్యులు అందిస్తున్న సేవల […]

Read More
కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త కార్యదర్శిగా రాజేష్ భూషణ్

కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త కార్యదర్శిగా రాజేష్ భూషణ్​

సారథి న్యూస్​, ఢిల్లీ : కేంద్రంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేష్ భూషణ్‌ను కేంద్ర ఆరోగ్య,కుటుంబసంక్షేమ శాఖ కొత్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్థుతం ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రీతి సుడాన్ జులై 31వతేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 1987 బ్యాచ్ బీహార్ క్యాడర్ అధికారి అయిన రాజేష్ భూషణ్ ను కొత్త కార్యదర్శిగా కేంద్రం నియమించింది. ప్రీతి సుడాన్ పదవీకాలం ఏప్రిల్ తో ముగిసినా కరోనా వల్ల ఆమె పదవీకాలాన్ని […]

Read More
ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ‌రావ‌తి: ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్)పై ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచింది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం సంతకం చేశారు. సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి ఆశయ సాధన […]

Read More
పంటలునమోదు చేయించుకోవాలి

పంటను నమోదు చేయించుకోవాలె

సారథి న్యూస్, రామయంపేట: ప్రతి గ్రామంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీష్ సూచించారు. శనివారం మండలంలోని నందిగామ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. పంట గణన ప్రక్రియ పక్కాగా ఉండాలన్నారు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ఎప్పకప్పుడు ఆన్​లైన్​లో అప్​లోడ్​చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో దివ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్, రాజగోపాల్ ఉన్నారు.

Read More
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

నడిగడ్డలో భారీ వర్షాలు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ […]

Read More
మధ్యప్రదేవ్​ సీఎంకు కరోనా

మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​(61) చౌహాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ‘ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ ఐసోలేషన్​లో ఉన్నాను. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల […]

Read More
సపోటాతో లాభాలెన్నో

సపోటాతో లాభాలెన్నో!

సపోటా పండు రుచిలోనే కాదు.. పోషకవిలువలు పెంచడంలోనూ రారాజే అని చెబుతున్నారు పరిశోధకులు. సపోటా గుజ్జులో ఉండే ఫైబర్లు మలబద్దక సమస్యను పొగొడతాయి. జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా నివారిస్తుంది. అంతేకాక సపోటా ఎంతో త్వరగా శరీరానికి శక్తినిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు రోజు ఒక సపోటా తీసుకోవడం ఉత్తమం. దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా సపోటా దగ్గరికి రానీయ్యదు. కిడ్నీలో రాళ్లకు, స్థూలకాయ సమస్యలకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది. సపోటాలో ఉండే విటమిన్-ఏ వల్ల […]

Read More