ఊరూరా సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు, 128 పంచాయతీల్లో మొత్తం 806 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న టెంపుల్ లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్‌ఐఏ కేసులను […]
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ సినిమాతో పెను దుమారమే రేపుతున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్ సర్‌ప్రైజ్ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్ రావడంపై పవన్కళ్యాణ్అభిమానులకు థ్యాంక్స్చెప్పారు.
మరాఠీలో సక్సెస్ అయిన సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా స్థిరపడిన అనసూయ ఈ మూవీలో విలన్‌గా కనిపించనుందట. అయితే గతంలో ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర ఒకటి చేసింది అనసూయ. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపిస్తుందట. ఈ సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేస్తుందట. ఏ పాత్రలోనైనా తన నటనానైపుణ్యంతో అదరగొట్టే అనసూయ […]
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలను వెలికితీసే పాత్ర పోషిస్తున్నందున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో బయట పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు వీలు లేదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట టీమ్. ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించేందుకు మోగాస్టార్ లుక్ […]
కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. […]
బెంగళూరు: కరోనాభయంతో మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. సాటి మనిషిపై కనీసం కనికరం లేకుండా పోతున్నది. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన చోటుచేసుకున్నది. కరోనా భయంతో ఓ గర్భిణిని చేర్చుకోవడానికి మూడు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆ మహిళ ఆటోలోనే ప్రసవించింది. గర్భిణి ప్రాణాలతో భయపడగా.. బిడ్డ మాత్రం మృతిచెందింది. ఆసుపత్రులు కనికరం చూపించి ఉంటే ఆ పసికందు బతికేది. ‘కర్ణాటకలో కరోనా చావులు తక్కువగానే ఉన్నాయి. కానీ కరోనా భయంతో ఆస్పత్రులు వైద్యం నిరాకరించడం వల్ల […]
సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను […]