డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో వస్తున్న సినిమాలకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. తాజాగా జీ5లో మరో వెబ్ సిరీస్ ఈ నెలాఖరున రిలీజ్ కాబోతోంది. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ‘రోబో’ చిత్రాన్ని నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు శంకర్ తెరకెక్కించిన ‘నన్బన్’ (తెలుగులో స్నేహితుడు) సినిమాకు అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘మేక సూరి’. సుమయ, అభినయ్ ను కీలకపాత్రల్లో పరిచయం చేస్తూ నిర్మించిన వెబ్ సిరీస్ […]
సారథి న్యూస్, వనపర్తి: చారిత్రక సరళాసాగర్ ప్రాజెక్టు గండి పూడ్చివేత, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళవారం ప్రాజెక్టును మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పున:ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31న ప్రాజెక్టుకు గండిపడడంతో నీరతా వృథాగాపోయింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లడంతో ప్రకృతి విపత్తుల నిధుల నుంచి రూ.ఆరుకోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. మే నెలలో డిజైన్ ఇచ్చి అధికారులు పనులను మెగా కంపెనీకి అప్పగించారు. వెంటనే వారు పనులు ప్రారంభించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ ను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో కలిశారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ శుభసందర్భంగా కలిసి బొకే అందజేశారు. అమ్మవారిని పూజించి కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకోవాలని గవర్నర్‌ను కోరారు.
అనారోగ్యంతో వ్యక్తి మృతి కరోనా అనుమానంతో ముందుకురాని బంధువులు, కుటుంబసభ్యులు ఆటోలో డెడ్‌బాడీని తీసుకెళ్లిన ఎస్సై మారుతి శంకర్ అంత్యక్రియలు జరిపి ఆదర్శంగా నిలిచిన పోలీసు అధికారి సారథి న్యూస్, కర్నూలు, ప్యాపిలి: బంధాలు.. బంధుత్వాలు మరిచిన సమాజంలో మానవత్వం పరిమళించింది. మనుషులకు, మానవత్వానికి ఖాకీలు విలువ ఇవ్వరని భావించే వారంతా సోమవారం ఓ ఎస్సై చేసిన మంచి పనికి ఫిదా అయిపోయారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందితే బంధువు, కుటుంబసభ్యులు […]
సీనియర్ నటుడు అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య సోషల్ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక ఐశ్వర్య 2013లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో […]
బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై కొంతకాలంగా కంగనారనౌత్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ స్టార్హీరోయిన్లు, దర్శక నిర్మాతలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అవార్డుల గురించి మండిపడింది. అవార్డుల ఎంపికలోనూ బాలీవుడ్ ప్రముఖులు విధిగా బంధుప్రీతితోనే ఫాలో అవుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. ‘దీపికా పదుకొనేకు గతంలో హ్యాపీన్యూ ఇయర్ అనే సినిమాకు అవార్డు వచ్చింది. కానీ ఆ అవార్డును దీపిక తీసుకోలేదు. నాకంటే క్వీన్‌లో కంగనా బాగా చేసిందని స్టేజీ మీదే చెప్పింది. అలియాభట్ మాత్రం ‘గల్లీభాయ్’ […]
లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఇటీవల పోలీసులు ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్‌మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్‌దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్‌లో జూలై 10న జరిగిన ఎన్కౌంటర్లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీలో రెండు మూడు రోజులుగా కరోనా కంగారు పెట్టిస్తోంది. వరుసగా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లోనే సుమారు తొమ్మిదివేల దాకా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి. కేవలం పాజిటివ్ కేసులు పెరగడమే కాదు.. మరణాలు కూడా రోజుకు 50కి పైనే ఉంటున్నాయి. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి దేశంలోనే అత్యధిక టెస్టులు ఇక్కడే జరుగుతున్నాయి. ఎక్కువ టెస్టులు జరుగుతున్నాయి కాబట్టి కేసుల […]