Breaking News

Day: July 17, 2020

కులభూషణ్​ను కలిసేందుకు అనుమతి

కుల్‌భూషణ్​ను కలిసేందుకు అనుమతి

న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో పాకిస్థాన్​లో అదుపులో ఉన్న కుల్​భూషన్‌ జాదవ్‌ను కలిసిందేకు పాకిస్తాన్‌ భారత్‌కు పర్మిషన్‌ ఇచ్చింది. జాదవ్‌ను అధికారులు మూడోసారి కలవనున్నారు. ఇంటర్నేషనల్‌ కోర్టు ఇచ్చిన వెసులుబాట్లను పాక్‌ కల్పించడం లేదని, కోర్టు తీర్పును పక్కనపెట్టిందని ఇండియా ఆరోపించిన నేపథ్యంలో అతన్ని కలిసేందుకు పాక్‌ అధికారులు పర్మిషన్‌ ఇచ్చారు. పాకిస్తాన్‌ అధికారులు లేకుండా కుల్‌భూషన్‌ యాదవ్‌ను కలిసేందుకు వీలు కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ చెప్పారు.

Read More

వెంటిలేటర్‌‌పై కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్​పై ఉన్నదని ఏ శక్తి దాన్ని కాపాడలేదని ఆప్​ అధికార ప్రతినిధి రాఘవ చాదా విమర్శించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్​ అధికారం కోసం కుట్రలు పన్నుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలపై ప్రేమలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని […]

Read More

కరోనా@ 1 మిలియన్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ దాటింది. 24 గంటల్లో 36,247 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,004,652కి చేరింది. ఒక్క రోజులో 690 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 25,594కి చేరింది. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదవ్వడం ఇదే. 10లక్షల కేసుల్లో 3,43,268 యాక్టివ్‌ కేసులు కాగా.. 6,35,790 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అమెరికాలో 3,648,250 […]

Read More
ఓటీటీలో జాన్వీ సినిమా

ఓటీటీలో జాన్వీ సినిమా

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్​లో నటించింది. ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూహిఅప్జానా, దోస్తానా 2’ సినిమాలు లైన్​ పెట్టి చేస్తోంది. ఈ చిత్రాల్లో జాన్వీ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత […]

Read More
మళ్లీ తనే కావాలంట..

మళ్లీ తనే కావాలంట..

‘సీత’సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సమయాన్ని రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయడంలో వెచ్చించాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన తేజ అందులో మొదటిది గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ […]

Read More
రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు నోటీసులు

జైపూర్‌‌: సీఎల్పీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, సచిన్‌పైలెట్‌కు సపోర్ట్‌ చేసిన 19 మంది పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే 19 మందికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాళ్ల ఇళ్లకు నోటీసులు అంటించారు. వాళ్లంతా ఎక్కడున్నారో తెలియనందున తప్పించుకునేందుకు వీలు లేకుండా వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా నోటీసులు పంపారు. అంతే కాకుండా వాళ్ల నివాసాలకు ఇంగ్లీష్‌, హిందీల్లో ఉన్న నోటీసులను కూడా అంటించారు. ‘మీటింగ్‌ గురించి తెలిసి […]

Read More
రెచ్చిపోయిన హ్యాకర్లు

రెచ్చిపోయిన హ్యాకర్లు

అమెరికాలో ట్విట్టర్‌‌ అకౌంట్స్‌ హ్యాక్‌ బిట్‌కాయిన్‌ అడ్రస్‌కి డాలర్లు పంపాలని మెసేజ్‌ ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామన్న ట్విట్టర్‌‌ వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో హ్యాకర్లు రెచ్చిపోయారు. హై ప్రొఫైల్‌, బ్లూ టిక్‌ ఉన్న ట్విట్టర్‌‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. బిట్‌కాయిన్‌ అకౌంట్‌ అడ్రస్‌ పెట్టి డబ్బులు పంపితే రెట్టింపు చెల్లిస్తామని మెసేజ్‌ ఉంచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, జాన్‌ బిడెన్‌, ఎలన్‌ మస్క్‌, జఫ్‌ బిజోస్‌ తదితరుల అకౌంట్లను హ్యాక్‌ చేసి ఆ మెసేజ్‌పెట్టారు. దీంతో […]

Read More
కరోనా.. ఆక్స్​ఫర్డ్​ గుడ్​న్యూస్​

కరోనా.. ఆక్స్‌ఫర్డ్‌ గుడ్‌న్యూస్‌

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గుడ్‌న్యూస్‌ అందిచనుందని తెలుస్తోంది. ఫేస్‌ – 1 ట్రయల్స్‌ ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలిందని సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ త్వరలోనే తెలిపే […]

Read More