Breaking News

Day: July 15, 2020

మొక్కలు నాటడం మన బాధ్యత

సారథిన్యూస్​, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్​ కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్​ క్యాంప్​ కార్యలయంలో ఇక్చాల్​ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

దైవదర్శనం విషాదాంతం

సారథిన్యూస్​, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్​ సమీపంలోని ఘట్​కేసర్​ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్​రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More

రామడుగులో కరోనా కలకలం

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో రామడుగు మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెదిర గ్రామంలో మంగళవారం శానిటైజేషన్​ నిర్వహించారు. గ్రామంలోని విధులను శుభ్రపరిచారు. ప్రజలంతా సామాజికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Read More
జూరాల 6 గేట్ల ఎత్తివేత

జూరాల 6 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆరుగేట్లను బుధవారం ఎత్తి 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 60వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఎగువ, దిగువ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్​కోసం 21,240 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తంగా 59,380 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.

Read More
దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా […]

Read More
సచివాలయం కూల్చివేతపై విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణ

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్​విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్​భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్​లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More

పోలీస్ ఆఫీసర్ గా చేయాలనుంది

అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉండే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇన్ స్టాగ్రామ్ లో ఈసారి అతని సినిమా విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ప్రస్తుతం తను చేస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రీమేక్ మూవీ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. టీజర్ చూస్తే ఎవరూ అలా అనుకోరు.. కానీ టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్నిరోజులు పడుతుందని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పాడు. రీసెంట్ గా ఈ మూవీకోసం […]

Read More