Breaking News

Day: July 10, 2020

సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సీఎంవో కోఆర్డినేటర్​కు సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులైన వైఎస్సార్​సీపీ ఆఫీసు ఇన్​చార్జ్​శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బీవై రామయ్య శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపొగు, జిల్లా ప్రధాన కార్యదర్శి కటికె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణలో కోవిడ్​ కాల్​సెంటర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రం కోవిడ్​ బాధితుల కోసం ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ కాల్​సెంటర్​ ద్వారా కోవిడి పాజిటివ్​ బాధితులు హోం ఐసోలేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించనున్నారు. 18005994455 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​చేసి సూచనలు పొందవచ్చు. వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవారికి 17 రోజులపాటు నిపుణులు ఫోన్​లో సూచనలు ఇస్తారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. రెండువిడుతల్లో సుమారు 200 మంది ప్రతినిధులు […]

Read More

నిర్వాసితుల కన్నెర్ర

సారథి న్యూస్​, హుస్నాబాద్: పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు కన్నెర్ర చేశారు. తమకు పూర్తి పరిహారం చెల్లించేవరకు పనులు చేసుకోనివ్వబోమంటూ అడ్డగించారు. సిద్దిపేట జిల్లా గూడాడిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు పునరావాస ప్యాకేజీ డబ్బులు చెల్లించలేదని వారు వాపోయారు. అధికారులు సంతకాలు తీసుకొని సంవత్సరం కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి ఘటనాస్థలికి చేరుకొని పరిహారం చెల్లిస్తామని హామీ […]

Read More
మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

సిద్దార్థ షాలిని నటించిన ‘ఓయ్’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఆనంద్ రంగ ఆ తర్వాత మరే సినిమా డైరెక్షన్ చెయ్యలేదు. అయితే ఇప్పుడో మాంచి చాన్స్ అందుకున్నాడట. మెగాస్టార్ ముద్దుల తనయ సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్​ను నిర్మించబోతోంది. దీనికి […]

Read More
మాస్టారూ ఎప్పుడొస్తారు?

మాస్టారూ ఎప్పుడొస్తారు?

కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా గ్జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్ హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్​గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ఆ ప్లాన్ మారిపోయింది. తెలుగు […]

Read More
కజకిస్తాన్​లో గుర్తుతెలియని వైరస్‌

కజకిస్తాన్​లో గుర్తుతెలియని వైరస్‌

నూర్‌‌సులాన్‌: చైనా సరిహద్దు దేశం కజికిస్థాన్‌లో గుర్తు తెలియని వైరస్‌ విజృంభిస్తోందని చైనా ఎంబసీ చేసిన ఆరోపణలను కజకిస్థాన్‌ కొట్టిపారేసింది. చైనా ఎంబసీ చేస్తున్న ఆరోపణలు వట్టి పుకార్లే అని చెప్పింది. కజకిస్థాన్‌లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న సమచారం సరైంది కాదు అని ప్రకటన రిలీజ్‌ చేసింది. బ్యాక్టీరియా, ఫంగల్‌, వైరల్‌ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని తాము వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని […]

Read More
ఇండియా @ 7,93,802

ఇండియా @ 7,93,802

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు […]

Read More
పాక్​ విమానాల బ్యాన్​

పాక్‌ విమానాల బ్యాన్‌

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు అమెరికా పెద్ద షాక్‌ ఇచ్చింది. నకిలీ లైసెన్సుల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్‌ విమానయాన సంస్థ (పీఐఏ)పై నిషేధం విధించింది. పీఐఏపై యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే నిషేధం విధించింది. పాకిస్తాన్‌ నుంచి అమెరికాకు నడిచే పీఐఏ చార్టర్‌‌ ఫ్లైట్స్‌ అనుమతిని రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రకటించింది. పాకిస్థాన్‌లో సగానికి పైగా పైలెట్‌ లైసెన్సులు నకిలీవని తేలడంతో ప్రంపచవ్యాప్తంగా పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) […]

Read More