Breaking News

Day: July 8, 2020

హరితహారం.. మహాయజ్ఞం

సారథిన్యూస్/ చొప్పదండి/ హుస్నాబాద్: హరితహారం ఓ మహాయజ్ఞమని ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలను నాటడాన్ని తమవిధిగా భావించాలని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితెల సతీశ్​కుమార్​ తమ నియోజవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్​ను కోరారు. దీనికి […]

Read More

గురుకులను ఎత్తివేయడం తగదు

సారథిన్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను వనపర్తి జిల్లాకు తరలించడం సరికాదని కాంగ్రెస్​ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్​ నేతలు బిజినేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్​ అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 540 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, ఈశ్వర్, పాషా, బలమాసయ్య, మిద్దె సూరి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read More

పరిహారం ఇస్తేనే పనులు చేయనిస్తం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ‘పరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి’ అంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బుధవారం ప్రాజెక్టు పనులను అడ్డకున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని అధికారులు సంతకాలు చేయించుకొని సంవత్సరం కావస్తున్నా, నేటికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు.

Read More

దళితుల ఆత్మగౌరవంపై దాడి

సారథిన్యూస్, రామడుగు: అంబేద్కర్​ ఇంటిపై దాడిచేయడమంటే దళితుల ఆత్మగౌరవంపై దాడిచేసినట్టేనని టీపీసీసీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ వెన్న రాజమల్లయ్య పేర్కొన్నారు. అంబేద్కర్​ నివాసం రాజగృహపై దాడిని కాంగ్రెస్​ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ డిమాండ్​ చేశారు. […]

Read More

బొగ్గుగనులు ప్రైవేట్​పరం కానివ్వం

  • July 8, 2020
  • Comments Off on బొగ్గుగనులు ప్రైవేట్​పరం కానివ్వం

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ నాయకులు డిమాండ్​ చేశారు. లేదంటే కేంద్రం మెడలు వంచైనా నిర్ణయం వెనక్కి తీసుకోనేలా చేస్తామన్నారు. జాతీయ సంఘాలతోకలిసి దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్​ ఇంతవరకు స్పందించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, […]

Read More

వృద్ధుడి బలవన్మరణం

సారథిన్యూస్, రామడుగు: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. నడువలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంగనగర్​ జిల్లా రామడుగు మండలం గండికి చెందిన జనగం రాజయ్య (80) కొంతకాలంగా నడవలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష తెలిపారు.

Read More
వీధి వ్యాపారులను ఆదుకుందాం

వీధి వ్యాపారులను ఆదుకుందాం

సారథి న్యూస్, కర్నూలు: వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాని ఆత్మనిర్భర్​నిధి పథకాన్ని అర్హులైన వారికి అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ మెప్మా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన మెప్మా పీడీ తిరుమలేశ్వర్ రెడ్డి తో కలిసి సీవోలతో సమావేశమయ్యారు. వీధి వ్యాపారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే ప్రక్రియ, సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం రూపొందిన ప్రత్యేక యాప్ లో ఎంత […]

Read More
పనులు కంప్లీట్​చేయండి

పనులు కంప్లీట్ ​చేయండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలక పరిధిలో మెరుగైన తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించి చేపట్టిన అమృత్ పైప్ లైన్ పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజా నీటి అవసరాలను తీర్చాలని కమిషనర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దపాడు గ్రామ సమీపంలో జరుగుతున్న పనులను కమిషనర్​ పరిశీలించారు. కాంట్రాక్టర్​ నుంచి నిర్దిష్ట టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పనులు జరిగేలా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ సురేంద్రబాబును ఆదేశించారు.

Read More