Breaking News

Day: July 8, 2020

కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప- బెంగళూరు బస్సులకు బ్రేక్​

కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]

Read More
వ్యభిచారం గుట్టురట్టు

వ్యభిచారం గుట్టురట్టు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని యశ్వంత్‌పూర్ ఏరియాలోని ఓ గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ గెస్ట్‌హౌస్‌పై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న ఐదుగురు యువతులను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ రైడింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. […]

Read More
తెలంగాణ @ 1,924

తెలంగాణ @ 1,924

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,536 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 992 మంది డిశ్చార్జ్​కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. తాజాగా 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇప్పటివరకు 1,34,801 టెస్టులు చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
ఏపీ లాయర్లకు గుడ్​ న్యూస్​

ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్

సారథి న్యూస్​, కర్నూలు: ఏపీ లాయర్లకు సీఎం జగన్ మోహన్​రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ […]

Read More
కృష్ణమ్మ బిరబిరా పరుగులు

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

సారథి న్యూస్​, గద్వాల: ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించాయి. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువకు బిరబిరా పరుగులుతీస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి పంపింగ్​లను కూడా ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్​ శాఖ రిపోర్టు ఆధారంగా ఎప్పటికప్పుడు సాగునీటి వివరాలను అందిస్తున్నాం. ప్రాజెక్టులు పూర్తి నిల్వ ప్రస్తుతం ఇన్ […]

Read More

వైస్ ​ఎంపీపీ ఇంట్లోనే పేకాట

సారథిన్యూస్​, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​లోని వైస్​ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]

Read More

సూర్యాపేటలో విజృంభిస్తున్న కరోనా

సారథిన్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Read More

మాస్కులు లేకుంటే బాదుడే

సారథిన్యూస్​, మహబూబాబాద్: ప్రజలు మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మహబూబాబాద్​ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ యాక్ట్​ 51 (బీ) చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ముఖ్యమైన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార సముదాయల్లో ఎప్పటికప్పడు తనిఖీ చేస్తామని.. మాస్క్​ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read More