Breaking News

Day: July 6, 2020

జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయం

సారథిన్యూస్​, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్​ చైర్మన్​ ఉదయ్​కుమార్​ పేర్కొన్నారు. జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్​రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్​రామ్​ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు […]

Read More

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

సారథిన్యూస్​, బిజినేపల్లి/రామడుగు: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధిక విద్యుత్​చార్జీలు వసూలుచేస్తూ పేదల నడ్డి విరుస్తున్నదని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆరోపించారు. కరెంటు బిల్లులపెంపునకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నాగర్​కర్నూల్​​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సబ్​స్టేషన్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గుండి సబ్​స్టేషన్​ ఆవరణలోనూ కాంగ్రెస్​ నేతలు నిరసన చేపట్టారు. ధనికరాష్ట్రమంటు గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు విద్యుత్​ చార్జీలు […]

Read More
అలా అయితేనే చేస్తా..

అలా అయితేనే చేస్తా..

సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్​లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్​లో టాప్ హీరోయిన్​గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్​లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే […]

Read More
‘చిరుత’పిల్లకు బంఫర్​ ఆఫర్​

‘చిరుత’ పిల్లకు బంపరాఫర్

పూరీ జగన్నాథ్ సినిమా ‘చిరుత’లో నటించింది నేహా శర్మ. రామ్​ చరణ్ కు అది మొదటి సినిమానే అయినా తన ఫస్ట్ మూవీ మెగా హీరోతోనే జోడి కట్టింది నేహా. మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించిన నేహా నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో నేహాకు టాలీవుడ్​ లో తిరుగుండదు అనుకున్నారంతా. కానీ అమ్మడి విషయంలో అది తారుమారు అయింది. తెలుగులో ఆశించిన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా […]

Read More
అర్చకులు ఐక్యత చాటాలె

అర్చకులు ఐక్యత చాటాలె

సారథి న్యూస్, అలంపూర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దూప దీప నైవేద్య పథకం కింద పనిచేసే అర్చక స్వాములు అంతా ఐకమత్యానికి మారుపేరుగా నిలవాలని అర్చక సంఘం ఉపాధ్యక్షుడు, అర్చక సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు తిరునగరి నరేంద్రాచార్యులు అన్నారు. సోమవారం అలంపూర్​చౌరస్తాలోని మార్కెట్ యార్డులో సంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దేవాదాయశాఖ డీడీఎన్​ఎస్​త్రీమెన్​కమిటీ బాధ్యుడు దిండిగల్​ఆనంద్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రాచార్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ఆలయాల అర్చకులు వారి ప్రాంతంలో […]

Read More

విమానాలు ఢీకొని 8 మంది మృతి

వాషింగ్టన్​: రెండు విమానాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్నది. విమానాలు కోయర్ డీఅలెన్ సరస్సులో మునిగిపోయాయి. రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. రెండు విమానాల శకలాలను సోనార్​ సాయంతో గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు.

Read More
గిరిజన గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు

గిరిజన గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశపరీక్ష (టీటీడబ్ల్యూఆర్‌జేసీ) ఫలితాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. రిజల్ట్​ను TGGURKULAM లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 7,040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Read More
గురుకుల స్టూడెంట్స్​కు ఆన్​లైన్ ​క్లాసెస్​

గురుకుల స్టూడెంట్స్​కు ఆన్​లైన్ ​క్లాసెస్​

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండడంతో స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చదువుతున్న స్కూలు, ఇంటర్​మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్​కు ‘జ్ఞానదీక్ష’పేరుతో ‘దూరదర్శన్–యాదగిరి’ చానెల్​ద్వారా ఆన్​లైన్​ పాఠాలు చెప్పనున్నారు. ప్రతిరోజు అరగంట పాటు(30 నిమిషాలు) మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు పాఠాలు ప్రసారం చేయనున్నారు. జులై 6 నుంచి […]

Read More