సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్రామడుగు మండలాధ్యక్షుడిగా బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్మెడిపల్లి సత్యం ఉన్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజల్,పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్జిల్లా చొప్పదండి ఎన్టీఆర్చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వరకు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్మేడిపల్లి సత్యం, పట్టణాధ్యక్షుడు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ముద్దం తిరుపతి, గుర్రం రమేష్ పాల్గొన్నారు.
బీజింగ్: మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన చైనా యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో సదరు కంపెనీకి దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కి చెందిన టిక్‌టాక్ బ్యాన్‌తో పాటు మరో రెండు యాప్‌లను కూడా మన ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ యాప్స్ బ్యాన్ వల్ల దాదాపు ఆరు బిలియన్ డాలర్లు చైనాకు నష్టం వాటిల్లుతుందని కంపెనీకి చెందిన ఒక వ్యక్తి కూడా చెప్పారు. చైనా ప్రభుత్వంతో […]
టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ కోలీవుడ్ లో ‘ఆదిత్య వర్మ’ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆదిత్య వర్మగా లీడ్ రోల్ చేసింది కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. సినిమా అంత సక్సెస్ సాధించకపోయినా నటుడికి ధృవ్ కు మంచి పేరే వచ్చింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం దక్కింది . ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో విక్రమ్ 60వ సినిమా రూపొందనున్న విషయం […]
ఇండస్ట్రీలో హిట్ సినిమాల రీమేక్ ల ముచ్చట కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన సినిమాలను ఆయా భాషల వాళ్లు రీమేక్ చెయ్యడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయ్యింది కూడా. అందుకే ఏ సినిమా అయినా రిలీజై హిట్ అయితే మాత్రం వెంటనే ఆ సినిమా రైట్స్ ను దక్కించుకునే పనిలో పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ కేటగిరీలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంతకు ‘ప్రేమమ్’ లాంటి మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసింది. […]
తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనాతో మృతిచెందారు. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొన్నది. ఈ తరం ఫిలింస్ అధినేత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు. కరోనా బారినపడటంతో రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ తరం ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు. ఇక బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామి, ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, […]
కరోనా మహమ్మారి టీవీ, సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్నది. తాజాగా బిగ్‌బాస్ ఫేం రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నే స్వయంగా రవికృష్ణే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని చెప్పారు. తనతో కాంటాక్ట్ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రవి సూచించారు. […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌కు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం […]