సారథి న్యూస్, హైదరాబాద్: ఫోన్‌లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి. బయట కొంటే మేం వాటిని అనుమతించం. తప్పనిసరిగా మా దగ్గరే తీసుకోండి. ఈ బెదిరింపులే ఇప్పుడు తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. కరోనా కాటుకు విద్యారంగం విలవిల్లాడుతోంది. క్లాసులు జరిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే. దీంతో విద్యార్థుల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబ్‌లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, డ్రెస్‌లు, బ్యాగులూ […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజీపేట, తిమ్మాపూర్ తో పాటు పలు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేయడంపై గురువారం మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి శివ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటుకోవాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త రిక్షాలు చెత్తను వేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరహరి, సీఏలు లావణ్య, […]
సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్‌ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 […]
సోషల్‌మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు పెట్టడం.. లైవ్‌లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి వారిని ఇబ్బందులకు గురిచేయడమే కామనే. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఇబ్బందికరంగా ప్రశ్నించిన ఓ నెటిజన్‌పై గోవా బ్యూటీ ఇలియానా ఫైర్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గురించిన అన్ని విషయాలనూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే ఇలియానా.. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని చెప్పింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెతో […]
సారథిన్యూస్, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 సంస్థనుంచి ఆయన భారీగా నిధులను విత్‌డ్రా చేసుకున్నట్టు ఈడీ గుర్తించింది. దాదాపు 18 కోట్ల రూపాయలను రవిప్రకాశ్, మరో ఇద్దరు వ్యక్తులు విత్‌డ్రా చేసినట్టు కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ చేపట్టింది. 18 కోట్లను ఆయన ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రవిప్రకాశ్ ఏ1గా ఉన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: జీవీకే గ్రూప్ అధినేత జీవీ కృష్ణారెడ్డి, అతడి కుమారుడు సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణలో వీరు అవకతవకలకు పాల్పడ్డట్టు వీరిపై అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ. 705 కోట్ల మేర వీరు అక్రమాలకు పాల్పడ్డట్టు సమాచారం. ముంబై విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం జీవేకే సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా 2017లో బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సమాచారం.