సారథి న్యూస్, కర్నూలు: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో 108,104 వాహనాలను ప్రారంభించారని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో గురువారం మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్, శ్రీదేవి, ఆర్థర్ తదితరులతో కలిసి అంబులెన్స్వెహికిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు […]
చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ మరణాల కేసులో సీబీసీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్ స్పెక్టర్ శ్రీధర్, మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు […]
మెక్సికో: మెక్సికోలోని ఇరాపుయాటో సిటీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. రీహాబిటేషన్ సెంటర్‌లో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 24 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోకల్‌గా డ్రగ్స్ వ్యాపారం చేసేవవాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి.. రక్తంతో సంఘటనా స్థలం భయానకంగా […]
మయన్మార్: నార్త్ మయన్మార్‌లో ఘోరప్రమాదం సంభవించింది. జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడడంతో వంద మంది చనిపోయారు. ఒక్కసారిగా మట్టి, నీళ్లు వచ్చిపడడంతో చాలా మంది చనిపోయారని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా చాలా మంది మట్టిలో కూరుకుపోయారని అన్నారు. ఇప్పటివరకు వంద మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. కచిన్ జిల్లాలో భారీవర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని, గని దగ్గరలో పనిచేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడడంతో […]
హైదరాబాద్: గణేష్ పండగ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. గత ఏడాది 65 అడుగుల ఎత్తుతో ‘ద్వాదశాదిత్య మహాగణపతి’గా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేషుని విగ్రహ ఎత్తు ఈ సారి తగ్గింది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ విగ్రహం కేవలం 27 అడుగులకు మాత్రమే పరిమితం కానుంది. అంటే విగ్రహం ఎత్తు కిందటి సంవత్సరం కన్నా 38 అడుగుల మేరకు తగ్గనుంది. ఎత్తు తగ్గనున్న కారణంగా పూర్తిగా మట్టి […]
భోపాల్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అడిషనల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదారాజ్ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమర్తీదేవి, ప్రభురామ్ చౌధురి, ప్రధుమన్ సింగ్ థోమర్ కూడా […]
సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీసీ రామేశ్వర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ […]
సారథిన్యూస్, రామడుగు: ఉన్నత విద్యనభ్యసించిన యువత వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక లాభాలను అర్జిస్తున్నారు. పట్టణాల్లో వేల రూపాయలు సంపాదించే కొలువులు వదిలి పల్లె బాటపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మాలపూర్కు చెందిన కట్ట శ్రీను ఆధునిక పద్ధతిలో అంజీరాను సాగుచేస్తున్నాడు. శ్రీరాముల పల్లెలో దాదాపు 10 మంది యువ రైతులు వంద ఎకరాల్లో యాంత్రీకరణ పద్ధతి ద్వారా వరి […]