Breaking News

Month: June 2020

హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ

సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Read More

కలెక్టరమ్మా.. శభాష్​

సారథి న్యూస్, హైదరాబాద్‌: మహిళల సౌకర్యార్థం మొబైల్‌ ‘షీ టాయిలెట్’ ఏర్పాటు చేయడంపై నారాయణపేట జిల్లా కలెక్టర్‌ డి.హరిచందనను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. ‘మహిళల కోసం బయోడైజెస్టర్ టాయిలెట్ల ఏర్పాటులో కలెక్టర్‌ హరిచందన చొరవ ప్రశంసనీయం. ఈ గొప్ప ఆలోచన మహిళలకు సౌకర్యవంతమైనదే గాక భద్రతనూ కల్పిస్తోంది. అలాగే ఇవి బయోడైజెస్టర్‌ మరుగుదొడ్లు కావడం వల్ల స్థిరత్వం ఉంటుంది’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నారాయణపేట […]

Read More

ఒకేరోజు 920 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గురువారం తాజాగా 920 కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో 11వేల పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 230కి చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్​జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 6,446 యాక్టివ్​కేసులు […]

Read More

అక్రమ నిర్మాణాలను పట్టించుకోరా..?

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్​లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల […]

Read More

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఏసీపీ మహేందర్ కోరారు. గురువారం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అడవులు అంతరించి పోవడంతో పొల్యూషన్ పెరుగుతుందన్నారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ..బర్త్ డే, పెండ్లి రోజు తీపిగుర్తులకు చిహ్నాంగా ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యపాల్​రెడ్డి, జడ్పీటీసీ మంగ, స్పెషలాఫీసర్ నర్సింగరావు, ఎంపీవో సుమాన్, ఏపీవో ప్రభాకర్, ఎస్సై కొత్తపల్లి రవి, సర్పంచ్ […]

Read More

తెలంగాణలో కేంద్రబృందం పర్యటన

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.

Read More

మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్​లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్​ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్​లో ఉన్న 52 మందికి […]

Read More

నిరాడంబరంగా హరితహారం

సారథిన్యూస్​, నెట్​వర్క్​: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వర్​రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, జిల్లా కలెక్టర్​ […]

Read More