సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఆ పార్టీ విధానం ఏమిటో కూడా అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ టీడీపీపై దాడికి పదునుపెట్టింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను దూరం చేసి తమ వైపునకు తిప్పుకొంటోంది. మరోవైపు నాయకులపై కేసులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీని బలంగా ఢీకొనాలని టీడీపీ కూడా తమ విమర్శలకు పదును పెడుతోంది. కానీ, ఇటీవల కాలంలో ఆ పార్టీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వారియర్స్‌లో ప్రధానమైన డాక్టర్లు, వైద్యసిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వారికి రాత్రింబవళ్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కూడా ఇప్పుడు వైరస్ సోకుతోంది. కరోనా బారిన పడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. దీంతో వారితో పాటు సాధారణ జనాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా కరోనా చికిత్స చేసే డాక్టర్ల సంఖ్య ఇంకా […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి) : ధరణి పై మొక్కలు పెంచితెనే జీవరాశికి ప్రాణవాయువు లభిస్తుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకు డు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. గురువారం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉప్పల శ్రీనివాస్ గుప్త అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరేల్లిలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ప్రాణాన్ని ఇస్తే.. మొక్క ప్రాణ వాయువును ఇస్తుందని, ప్రతీ […]
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి) : ప్రభుత్వం మొక్కలు నాటే మహాయజ్ఞంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు తెలిపారు. గురువారం తెలంగాణకు హరితహారం 6వ విడతలో భాగంగా సైదాబాద్ డివిజన్, ఎల్ఐసీ కాలనీ లోని వివేకానంద పార్క్ లో దేవీప్రసాద్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వాసులకు తుమ్ము టెన్షన్ పట్టుకుంది. తుమ్ములతో ఎందుకు టెన్షన్ పడుతున్నారనేగా మీ ప్రశ్న. అదేనండి.. ఇది కరోనా కాలం కదా. అందుకేనండి అవంటే అందరూ భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంనుంచే కరోనా ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా దగ్గు, తుమ్ములు, మక్కు కారడం, గొంతునొప్పి, జ్వరం ప్రధాన లక్షణాలను వైద్యులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకినట్టుగానే భావించారు. వారికి […]
28-06-2020 తెలంగాణలో కరోనా ఉగ్రరూపం, ఆదివారం కొత్తగా 983 పాజిటివ్‌కేసులు నమోదు, మొత్తం 14,418కు చేరిన కేసుల సంఖ్య, తాజాగా నలుగురు మృత్యువాత, ఇప్పటి వరకు 247 మంది మృతి, యాక్టివ్‌కేసులు 9 వేలు, జీహెచ్ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 కేసుల నిర్ధారణ. 27-06-2020 నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్ లీక్, ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత, సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, విశాఖపట్నం ఆర్‌ఆర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె.తారక రామారావు సనత్ నగర్ నియోజవర్గం బల్కంపేట శ్మశానవాటికలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ […]
సారథి న్యూస్, షాద్‌నగర్: విద్యుత్ షాక్ తో బాబాయ్, అబ్బాయి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బాయి, బాబాయ్గాండ్ల సురేష్(45), గాండ్ల అభిలాష్(18) పొలం వద్ద బోరు మోటార్ ను రిపేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప పైపులను వెలికితీస్తుండగా పైనున్న11 కేవీ హై టెన్షన్ తీగలకు తగిలాయి. విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో మొగిలిగిద్దలో తీవ్ర విషాదం […]