సారథిన్యూస్, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఇప్పుడో కొత్త ప్రయోగానికి సాహసం చేస్తున్నాడు. మొదటి చిత్రం ‘అయ్యారే’ కి అంత గుర్తింపు రాకపోయినా 2016లో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలతో తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా సాగర్‌కు మంచి గుర్తింపునిచ్చింది. దీంతో అతడు సితారా ఎంటర్టెయిన్మెంట్ వారు నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేశాడు. మలయాళంలో బిగ్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ను సితార సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. […]
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో పోలీసులు 21 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
వీవీ వినాయక్ దర్శకత్వంలో మొదటిసారి ‘అల్లుడు శీను’గా వెండితెరకు పరిచమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమాకే కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకున్న బెల్లంకొండ గతేడాది ‘రాక్షసుడు’తో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ‘అల్లుడు అదుర్స్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకుందట. అయితే మిగతా షూటింగ్ లాక్ డౌన్ తో తాత్కాలికంగా వాయిదాపడింది. జూన్ మొదటివారం నుంచి షూటింగ్స్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ప్రభుత్వ […]
సారథిన్యూస్, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.36.36 కోట్ల కమీషన్ విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున కమీషన్ చెల్లించింది సర్కార్. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఒకటి, రెండు […]
సారథిన్యూస్, ఖమ్మం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వట్ వర్క్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అభిప్రాయ పడింది. ప్రభుత్వ నిర్ణయం బ్రాహ్మణులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణులకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరువ తీసుకోవాలని కోరారు.
సారథి న్యూస్, కర్నూలు: దేశంలోనే అతిపెద్ద ఆభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ‘ఆషాడం ప్రైస్ ప్రామిస్’ క్యాంపెయిన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిందని కర్నూలు షోరూం హెడ్ అస్నఫ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్‌ఉల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపెయిన్‌లో భాగంగా బంగారు ఆభరణాల తరుగు చార్జీపై 20 శాతం నుంచి 50శాతం తగ్గింపు, వజ్రామివపై 25శాతం వరకు తగ్గింపు, 22 క్యారెట్ల పాత బంగారంపై 0 […]