సారథిన్యూస్, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్ హాస్పిటల్‌ను రెన్యువల్ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్.. లంచం తీకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా కట్టడిలో పోలీసుల కృషి మరువలేనిదని ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి అన్నారు. మంగళవారం స్థానిక మినీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 24 మంది పోలీసు కానిస్టేబుళ్లు, సిబ్బందిని పూలమాలలతో కుటుంబసభ్యులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసుశాఖలో ఒత్తిడిని ఎదుర్కొని ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, కుటుంబాలకు న్యాయం చేస్తూ విధులు నిర్వహించారన్నారు. పోలీసు కుటుంబాల సహాయ సహకారాలు మరువలేనివన్నారు. రిటైర్డ్ మెంట్ తర్వాత ఏవైనా సమస్యలు […]
ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా దేశంలోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. పొగతో ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో అనధికారికంగా, పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే కట్టడాలను కూల్చివేస్తామని కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఉల్చారోడ్డులో ఉన్న ఎన్టీఆర్ బిల్డింగ్స్ ప్రాంత కూడలిలో పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. వంద అడుగు రోడ్డులో ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు యజమానుకు మొదటి నోటీసును పంపించారు. వారం రోజులు […]
సారథి న్యూస్, రామాయంపేట: అగస్టు 15 కల్లా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఆరో విడుత హరితహారం సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లాలో ని 75 క్లస్టర్ లలో రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో పరుశురాం నాయక్, మెదక్ ఆర్డీవో సాయిరాం, ఏడీ ఏ వసంత సుగుణ, తహసీల్దార్ జయరామ్, వ్యవసాయాధికారి సతీశ్, ఎంపీపీ సిద్ధరాములు, జెడ్పీటీసీ విజయ్ కుమార్, […]
సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపోగు, జేఏసీ నాయకులు నాగరాజు, సురేష్ కోరారు. ప్రొఫెసర్ల జీతాలు చెల్లించకపోవడంలో యూనివర్సిటీ ఇన్‌చార్జ్ ఉపకుపతి ఎంఎం నాయక్ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది యూనివర్సిటీ అధికారులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్‌చార్జ్ ఉపకుపతిని తొలగించి, రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్‌చేశారు. […]
సారథిన్యూస్, హన్మకొండ: ‘నా చావుకు కారణం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ సార్.. వచ్చే ఎన్నికల్లో అతడికి టికెట్ ఇవ్వొద్దు’ అని లెటర్ రాసి ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా అలంకానిపెట చెందిన మాసం వెంకటేశ్వర్లు సోమవారం హన్మకొండలోని అదాలత్ వద్ద అమరవీరుల స్తూపం ముందు కత్తితో గొంతు కోసుకున్నాడు. రక్తం ధారలు కట్టడంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం […]