సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, కాలేజ్‌లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లు (హెచ్‌బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, పూర్ణచందర్, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: రాష్ట్రంలో పచ్చదనం పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం పాతూరు, సుల్తాన్ పూర్ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని మెదక్ అడిషనల్కలెక్టర్ నగేష్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్మెంట్కమిషనర్ రఘునందన్ రావు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ నుంచి అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రకృతి వనాలను నిర్మించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ జరిపి వాటిని చదును చేసి వాటిలో ఎరువులు వేసి నేలను […]
సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే […]
సారథిన్యూస్, రామడుగు: భారత్, చైనా సరిహద్దులో మృతిచెందిన అమరజవాన్లకు కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘అమరవీరులకు సలామ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు పంజల శ్రీనివాస్ గౌడ్, నీలం దేవకిషన్, బాపిరాజు, మన్నే సహృదయ్, మాణిక్యం, […]
సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి 11వేల మార్క్ దాటింది. శుక్రవారం ఒకే రోజు 605 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారి కేసు 34, ఇతరదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,489కు చేరింది. యాక్టివ్ కేసులు 6,147కు చేరాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారు 5,196 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య […]
ముంబై : మహారాష్ట్రలో సెలూన్లు ఓపెన్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా మూడు నెలల నుంచి సెలూన్లను మూసివేశారు. దీంతో సెలూన్ నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర తెలిపిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. […]