Breaking News

Day: June 23, 2020

మెగా ఫోన్ పట్టబోతోంది

అందం, అభినయం రెండూ కలగలసి ఉండేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. వారిలో నిత్యామీనన్ ఒకరు. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైంది ఈ మలయాళ కుట్టి. అతికొద్ది కాలంలోనే తమిళం, తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా నిత్య సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ గ్యాప్ నిత్య కావాలని తీసుకుందట. ఎందుకంటే ఆమెకు దర్శకత్వం వైపు వెళ్లాలని ఉందని […]

Read More

ఆదాశర్మ.. డేరింగ్ డెసిషన్

డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌లో మెరిసింది అదాశర్మ. ఈ చిత్రంతో కుర్రకారుకి కిక్కెంచించిన ఆదాశర్మ ఇటీవల సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ కైపెక్కిస్తోంది. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తనను పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది. మితిమీరిన […]

Read More

ఒలింపిక్​ డే ఉత్సవాలు ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: ఒలింపిక్​డే సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసం నుంచి ఒలంపిక్స్​ఉత్సవాలను మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ప్రారంభించారు. జిమ్నాస్టిక్​క్రీడాకారుల విన్యాసాలు చూసి ముగ్ధులయ్యారు. వారిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.

Read More

సిరిసిల్ల దీటుగా కొడంగల్ ​

సారథి న్యూస్, వికారాబాద్: వికారాబాద్​ జిల్లా బొంరాస్​పేట మండలం మెట్లకుంటలో రూ.1.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీరోడ్డును మంగళవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.250 కోట్ల నిధులు వచ్చాయన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి దీటుగా కొడంగల్​ను అభివృద్ధి చేస్తామనడం ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్​కు ఉన్న ప్రత్యేకశ్రద్ధ అర్థమవుతుందన్నారు. కొడంగల్​ఎమ్మెల్యే నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

25 నుంచి ఆరో విడత హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 25న ప్రారంభించే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం లేఖలు రాశారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరారు. హరితహారంలో ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు.

Read More

హైవేల వెంట పూల మొక్కలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్​హైవేల వెంట ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ ఆర్అండ్ బీ ఆఫీసులో సమీక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్​ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలపై 50వేల మొక్కలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి మొక్కల చొప్పున మొత్తం 75వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు […]

Read More

28న పీవీ శతజయంతి ఉత్సవాలు

సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు. ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ […]

Read More

కొట్రలో కరోనా కలవరం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ ​అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్​ప్రస్తుతం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్​మెంట్​ అందించే క్రమంలో కరోనా మహమ్మారి […]

Read More