Breaking News

Day: June 22, 2020

టెన్త్​ గ్రేడ్​ ఇలా తెలుసుకోండి..

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్కూలులో విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా గ్రేడింగ్​ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాల రిజల్ట్స్​ వెబ్​సైట్​లో తెలుసుకోవచ్చని బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ తెలిపింది. ఈ కింద ఉన్న వైబ్​సైట్​ ద్వారా గ్రేడింగ్​ ఫలితాలను తెలుసుకోవచ్చు. BSE TELANGANA

Read More

లింక్ రోడ్ ప్రారంభం

సారథి న్యూస్​, హైదరాబాద్​: జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇటీవల కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.70 ప్రశాసన్ నగర్ నుంచి రోడ్ నం.78 వరకు రూ.2.81కోట్ల వ్యయంతో 0.47 కి.మీ మేర ఈ లింక్ రోడ్డును నిర్మించారు. తద్వారా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, దర్గా రోడ్ ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంది. నగరంలో మరో […]

Read More

నాన్నే నాకు స్ఫూర్తి

సారథి న్యూస్, అనంతపురం: ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలోని ప్రతి కీలకఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు, ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, […]

Read More

స్పిన్ దిగ్గజం రాజిందర్ కన్నుమూత

న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్​జోన్​కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం […]

Read More

వారెక్కడ?

తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్‌ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు […]

Read More

అడకత్తెరలో పోక చెక్కలా..!

ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చిరు […]

Read More

కల్నల్​ కుటుంబానికి సీఎం ఓదార్పు

సారథి న్యూస్​, సూర్యాపేట: చైనా సైనికుల దొంగ దాడిలో అసువులు బాసిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమవారం సీఎం కె.చంద్రశేఖర్​రావు పరామర్శించారు. కల్నల్​ సంతోష్​ బాబు సతీమణి సంతోషి, ఆయన పిల్లలు, తల్లిదండ్రులను పలకరించారు. వారిని చూసి సీఎం ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. పిల్లలు సీఎంకు నమస్కరించారు. అనంతరం సంతోష్​ బాబు సతీమణికి గ్రూప్​1 ఉద్యోగ నియామకపత్రంతో పాటు రూ.ఐదుకోట్ల విలువైన చెక్కు, 570 గజాల ఇంటిస్థలం డాక్యుమెంట్లను అందజేశారు. సీఎం వెంట […]

Read More

అమృత, ప్రణయ్.. ఆర్​జీవీ

జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ మూవీ రూపొందిస్తున్నట్టుగా సినిమా పోస్టర్​ను రిలీజ్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోస్టర్ చూడగానే మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్​ల ప్రేమకథ అని అర్థమైపోయింది. వర్మ తండ్రికూతుళ్లు అమృత, మారుతీరావు కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్​లో ప్రకటించారు. ‘మర్డర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది సబ్​టైటిల్​గా పెట్టాడు ఆర్జీవీ. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కేసు తెలుగు […]

Read More