హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ (హనుమతంతరావు)కు కరోనా సోకింది. రెండ్రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులంతా హోం క్వారంటైన్ ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవలే వందమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ రోజు నుంచే వీహెచ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌లోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి సేవా […]
నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను […]
కరోనా కాలం ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి పాలకుల దాకా పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులతో పాటు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ ప్రబలింది. అయితే, ప్రభుత్వం కొవిడ్ చికిత్సకు గాంధీ ఆస్పత్రిని కేటాయించింది. కరోనా రోగులందరికీ అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, గాంధీలో సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదని, ఇక వైద్యం దైవాధీనం అని అనేకమంది కరోనా రోగులు తమ బాధలను ఫోన్ల ద్వారా […]
సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది. […]
సారథి న్యూస్, రామాయంపేట: అత్యంత దైవభక్తి.. గ్రామదేవతలకు పూజలకు ప్రాముఖ్యం ఉన్న ఆషాఢ మాసం వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు ఈ మాసంలో అత్యంత భక్తి పారవశ్యలో గడుపుతారు. గ్రీష్మరుతువు పోయి వర్షరుతువు వస్తున్న తరుణంలో తొలకరి చినుకులు పుడమి పులకింతల్లో ఆషాఢ మాస ఆగమనం ఎన్నో కొత్త సొబగులను తీసుకొస్తుంది. ప్రకృతి పలకరింపుల పరిమళాలను.. అరచేతిలో పండిన గోరింటాకుల మనసును ముద్దాడుతుంది. నాగలి దున్నిన నేలంతా పులకిస్తూ విచ్చుకునే సమయాన […]
ఆకాశంలో మహాద్భుతం.. వలయాకార సూర్యగ్రహణం ప్రజలను ఆశ్యర్యానికి, ఆనందానికి గురిచేయనుంది. వలయాకార సూర్యగ్రహణాలు ఎలా ఉంటుందనే విషయంపైనే చాలామంది టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సూర్యగ్రహణంతో కరోనా వైరస్ చనిపోతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ, ఈ గ్రహణానికి, కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనిని అందరూ చూడొచ్చు. కాకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.2020లో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది. జూన్ 21న ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ […]