న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తాత్కిలిక హెల్త్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. హెల్త్ మినిస్టర్ సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సిసోడియాను టెంపరరీ హెల్త్ మినిస్టర్‌గా నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఇక నుంచి సిసోడియా మానిటర్ చేస్తారని అధికారులు చెప్పారు. సత్యేంద్ర జైన్ అస్వస్థతకు గురవడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. మొదటిరోజు టెస్టులు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. కాగా, బుధవారం నిర్వహించిన టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు ప్రస్తుతం […]
సుశాంత్ రాజ్‌పుత్ అక్క భావోద్వేగ పోస్ట్ ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతాసింగ్ కృతి ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరారు. ‘సుశాంత్.. నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. మేరా బేబీ, మేరా బాబు.. ఇకపై నువ్వు మా మధ్య భౌతికంగా లేవు. సారీ మేరా సోనా.. నువ్వు ఎంతో బాధలో ఉన్నావని, పోరాట యోధుడిలా పోరాడవని నాకు తెలుసు. నువ్వు […]
న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో యాత్రను నిలిపేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడం కరెక్ట్ కాదని చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అన్నారు. ‘ఈ పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహిస్తే పూరీ జగన్నాథుడు మనల్ని క్షమించరు” అని ఆయన కామెంట్ చేశారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రథయాత్రను నిలిపేస్తున్నట్లు అన్నారు. ఏర్పాట్లను […]
ప్రతాప్‌ఘడ్: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపినా కొంత మంది మృగాలకు బుద్ధి రావడం లేదు. మహిళల రక్షణ కరువైంది. దాదాపు పది ఏండ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న రీతిలోనే యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో అలాంటి తరహా ఘటనే జరిగింది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పిల్లలను చంపుతామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీలోని ప్రతాప్‌ఘడ్ నుంచి నోయిడాకు వెళ్లేందుకు […]
న్యూఢిల్లీ: 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దని భారత్ సంచార్ నిగమ్ లిమిలెట్ (బీఎస్ఎన్‌ఎల్)కు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) కోరింది. దీనికి సంబంధించి టెండర్ ప్రాసెస్‌ను కూడా సమీక్షించాలని చెప్పినట్లు అధికారులు చెప్పారు. ఎంటీఎన్‌ఎల్‌కు కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రెడేషన్‌కు చైనా పరికరాలను ఉపయోగించొద్దని అనుబంధ సంస్థ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)కు డీవోటీ సూచించింది. సెక్యూరిటీ ఇష్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: వందేళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు త్వరలోనే కొత్త అందాలను సంతరించుకుంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం రైల్వే స్టేషన్ ఎదుట రూ.30కోట్ల వ్యయంతో నిర్మింనున్న ఫుట్ పాత్ లు, బస్ షెల్టర్లు, రోడ్ల పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏడాదిలోగా అన్ని పనులను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 6,027కు చేరింది. గురువారం ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న 3,301 మంది డిశ్చార్జ్ అయ్యారు. మేడ్చల్ జిల్లాలో 10, […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద […]