Breaking News

Day: June 12, 2020

ఘనంగా బాలకృష్ణ బర్త్​ డే వేడుకలు

నందమూరి నటసింహం, బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా బుధవారం ఆయన ఇంట్లో నందమూరి, నారా వారి కుటుంబసభ్యుల మధ్య బర్త్​ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్​, బ్రహ్మణి, భరత్​, తేజస్విని, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ బ్లాక్​బస్టర్​​ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘వింటేజ్​ ఎన్​బీకే 1960’ థీమ్​తో రూపొందించిన ప్రత్యేకమైన టీషర్టులను బ్రహ్మణి, […]

Read More

సారస్వతమూర్తి సినారె

జూన్‌ 12న సినారె వర్ధంతి ‘చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకునమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకుకలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు..’మనిషిలోని చేతగానితనాన్ని ఎత్తిచూపారు సినారె.. విశ్వంభరుడు, మానవతా మహానీయుడు, ఆధునిక కవి, వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి, సుప్రసిద్ధ సినీగేయ రచయిత.. ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఆయనే మన సాహితీకోవిదుడు డాక్టర్​ సింగిరెడ్డి నారాయణరెడ్డి. అందరికి సినారెగా సుపరిచితులు. నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట […]

Read More

ఫలించిన పోరాటం

సారథిన్యూస్​, గోదావరిఖని: మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న కేశోరాం సిమెంట్​ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్​ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి పూర్తిస్థాయి వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా రామగుండం సమీపంలోని కేశోరాం కర్మాగారంలో పనిచేస్తున్న దాదాపు 1300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొమ్మిది రోజులుగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. దిగివచ్చిన కేశోరాం ఫ్యాక్టరీ వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు ఆందోళన […]

Read More

షకీలా సినిమా.. క్లీన్ యూ

అటు షకీలా సినీప్రస్థానంలో కానీ, ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎలాంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా రిలీజ్​కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ […]

Read More

‘సీటీమార్‌’.. ఇక తీన్మార్​

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్​ సంప‌త్ నంది ద‌ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ ఏడాది మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే మూడు షెడ్యూల్స్ లో 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌మిగతా భాగాన్ని ఆగ‌స్టు మొద‌టి వారం నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే […]

Read More

పిచ్‌ సైజు తగ్గించండి

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్​కు ప్రజాదరణ పెంచాలన్నా.. ఎక్కువ మంది ఇందులోకి రావాలన్నా ఆటలో కొన్ని మార్పులు చేయాలని టీమిండియా ప్లేయర్ జెమీమా రొడ్రిగ్స్ సూచించింది. ఇందులో భాగంగా పిచ్ సైజ్​ను కొద్దిగా తగ్గిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని అభిప్రాయపడింది. ‘ఇప్పుడున్న దానికంటే పిచ్ సైజ్​ను కాస్త తగ్గించాలి. దీనివల్ల ఫలితాలు భిన్నంగా వస్తాయి. ఆటలో మజా కూడా పెరుగుతుంది. ఎక్కువ మంది ఆటను చూస్తారు. ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓసారి ప్రయత్నించి చూడాలి’ అని ఐసీసీ […]

Read More

ఆస్వాదిస్తున్నా.. ఇంకా ఆడతా

న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం పుట్​బాల్​లో కొనసాగుతానని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని, మరో నాలుగేళ్లు కచ్చితంగా ఆడతాననే నమ్మకం ఉందన్నాడు. ‘ఈ తరానికి అవసరమైన ఫిట్​నెస్​తో ఉన్నా. ఆటపై ఆసక్తి పోలేదు. వీడ్కోలు పలకాలనే ఆలోచన కూడా లేదు. ఎవరైనా మెరుగైన ఆటగాడు వచ్చి నా గేమ్​ను శాసిస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఫుట్​బాల్​ ఆడడమే నాపని. 15 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం నేను చేసుకున్న […]

Read More

సొంతూళ్లకు వలసకూలీలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్, ఎర్రవల్లి తాండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీరంతా మహబూబ్ నగర్ నుంచి ఘట్​కేసర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో .. అక్కడి నుండి రైళ్ళలో స్వస్థలాలకు వెళ్లనున్నారు.శుక్రవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వీరికోసం ఏర్పాటుచేసిన బస్సులను పరిశీలించారు. […]

Read More