సారథిన్యూస్, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నెల 1న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. 10 రోజుల తర్వాత గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో 10,956 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. దీంతో ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న మన దేశం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరింది.స్పెయిన్, యూకేలను దాటేసింది. 24 గంటల్లో 396 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,607 కేసులు నమోదయ్యాయి. 152 […]
జైపూర్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే వీళ్లు మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన రాజస్థాన్ సీఎం అశోక్ […]
లండన్: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కాగా.. ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిపోతుందని సర్వేలో తేలింది. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ పార్ట్‌లోని యూఎన్‌యూ, డబ్యూఐడీఈఆర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కూడా దీనిపై రిసెర్చ్ చేశాయి. లాక్‌డౌన్ కారణంగా […]
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో జీతాలు చెల్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. లాక్‌డౌన్ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జులై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్‌లు అశోక్ భూషన్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ పాషాలతో కూడిన బెంచ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఎంప్లాయిస్, కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్ ఏర్పాటు […]
న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్ విధిస్తారని ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయినందన ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ చేయం, రూమర్స్ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై […]
సారథిన్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపూర్ మండల నూతన మార్కెట్ కమిటీ శుక్రవారం కొలువుదీరింది. పాలకమండలి చైర్మన్, సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ షేర్ చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘ఫ్రెండ్ షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ’ అని ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్ షిప్’ సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది. తమిళ బిగ్ […]