Breaking News

Day: June 11, 2020

అలంపురం.. దివ్యధామం

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి […]

Read More

దాదా, కోహ్లీ.. ఒకేలా

న్యూఢిల్లీ: క్రికెట్ ఆడే తీరు వేరైనా.. కెప్టెన్సీలో గంగూలీ, కోహ్లీ ఒకేలా వ్యవహరిస్తారని టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ సారథ్యం అందుకున్నాడు. తనకున్న నాయకత్వ లక్షణాలతో టీమ్​ను చాలా మెరుగుపర్చాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఫిట్​నెస్, ఫీల్డింగ్ ​లాంటి అంశాల్లో దాదాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగని లోపాలు లేని వారు ఎవరుంటారు? టీమ్​కు […]

Read More

టీ20 ప్రపంచకప్​పై తేలుస్తాం

న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్​పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్​ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల […]

Read More

చానూపై డోపింగ్ చర్యల్లేవు

న్యూఢిల్లీ: డోపింగ్​లో పట్టుబడిన భారత వెయిట్ లిఫ్టర్ సంజితా చానూపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంతర్జాతీయ సమాఖ్య(ఐడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్​పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. శాంపిల్స్​ను విశ్లేషించే క్రమంలో సరైన పద్ధతులను పాటించలేకపోయామని స్పష్టంచేసింది. ఈ మేరకు నాడా చేసిన ప్రతిపాదనల ప్రకారం చానూపై ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఐడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. తుది తీర్పుకు సంబంధించిన కాపీని ఈ మెయిల్ ద్వారా లిఫ్టర్కు పంపించామని చెప్పింది. అయితే […]

Read More

టోక్యో ఒలింపిక్స్.. సాదాసీదాగానే

టోక్యో: నాలుగేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు. తమ స్థాయి, పరపతి, ప్రతిష్టను ఇతర దేశాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా భారీమొత్తంలో ఖర్చుచేస్తారు. కానీ టోక్యో ఒలింపిక్స్ ఇందుకు అతీతం కానుంది. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించాలంటే మరింత ఖర్చు చేయాల్సిన పని. […]

Read More

వీళ్లను ఎట్ల ఔట్​ చేయాలి అంపైర్

లండన్: విరాట్, రోహిత్​ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్​లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్​కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్​కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్​నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్​లో అంపైర్​గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]

Read More

ఆగస్టు​లో శ్రీలంక టూర్​

ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇంకా ఔట్​డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టకపోయినా.. ఆగస్టు​లో శ్రీలంక పర్యటనను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. 3వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కోహ్లీసేన అక్కడ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లంకకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలుస్తున్నది. ఎఫ్టీపీ ప్రకారం ఈ సిరీస్​ను జూన్​లో నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడతో […]

Read More

బౌలర్లు రోబోలవుతారు

లాహోర్: బంతి మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడం బౌలర్లకు శాపంగా పరిణమిస్తుందని పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. దీనివల్ల బౌలర్లు రోబోలుగా తయారవుతారన్నాడు. బంతి స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్ ఆధిపత్యం మరింత పెరుగుతుందని వెల్లడించాడు. ‘బంతిపై ఉమ్మి రుద్దకపోతే కష్టమే. ఎందుకంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్​ లాంటి చల్లటి ప్రాంతాల్లో బౌలర్లకు అంత త్వరగా చెమటపట్టదు. అప్పుడు దేనిని వాడాలి. నా కెరీర్ మొత్తంలో నేను ఉమ్మి రుద్దే స్వింగ్​ను రాబట్టాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిని […]

Read More