Breaking News

Day: June 10, 2020

ఆగస్టు 8న రానా పెళ్లి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్​లో ఒకడైన రానా త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మిహికా బజాజ్ ను ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో మిహికాతో కలిసి తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇవ్వడమే కాదు.. రీసెంట్​గా పెద్దల సమక్షంలో రోకా ఫంక్షన్ కూడా జరుపుకుని ఆగస్టు 8న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా రానా పెళ్లి వాయిదాపడింది అంటూ పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. కానీ […]

Read More

పలాస దర్శకుడితో సుధీర్​

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు విభిన్న కథలను ఎంచుకుంటూ నటనకు ప్రాధాన్యమిచ్చే పాత్రలతో టాలీవుడ్​తోపాటు ఇతర భాషల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. లాక్ డౌన్ లో తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం సమయం కేటాయిస్తున్నాడట. దానికోసం కథలు వింటున్న సుధీర్ ‘పలాస’దర్శకుడితో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్​. పలాస చిత్రంలో దర్శకుడు కరుణ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంభినేషన్​లో వస్తున్న సినిమాపై సినిపరిశ్రమలో ఆసక్తి నెలకొన్నది. సస్పెన్స్​ థ్రిల్లర్​గా.. […]

Read More

ప్రైవేటీకరణకు ఒప్పుకోం..

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాక్​లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
JAGAN

వైఎస్సార్ ​సీపీలోకి శిద్ధ రాఘవరావు

సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని టీడీపీకి భారీ షాక్​ తగిలింది. టీడీపీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్​సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి శిద్ధాతో పాటు ఆయన కుమారుడు సుధీర్​కుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా శిద్ధా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు […]

Read More

కార్మికులను ఆదుకుంటాం

సారథి న్యూస్​, రామగుండం: కాంట్రాక్ట్​​ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందికి లాక్​డౌన్​ సమయంలోని ఏప్రిల్​ మాసంలో 50 శాతం వేతనాలు అందించేందుకు ఆ సంస్థ యజమాన్యం అంగీకారం తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో కేశోరాం ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి […]

Read More

పార్లే​​​​–జీ బిస్కెట్లు తెగ తినేశారు

న్యూఢిల్లీ: కరోనా లాక్​డౌన్​తో అన్ని కంపెనీలు కుదేలవ్వగా.. ప్రముఖ ఆహారసంస్థ పార్లే​​​​–జీకి మాత్రం ఈ సమయం కలిసివచ్చింది. లాక్​డౌన్​ సమయంలో ప్రజలు తమ కంపెనీ బిస్కట్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని ఆ సంస్థ వెల్లడించింది. అయితే లాక్‌డౌన్‌ ముందు వరకు కష్టాల్లో ఉన్న ఈ బిస్కెట్ల తయారీ కంపెనీ ఇప్పుడు అమ్మకాల్లో దూసుకుపోతుంది. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత విధంగా అమ్మకాలు జరిగాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు మార్కెట్‌ షేర్‌‌ 5 శాతానికి […]

Read More

కరోనా కేసుల్లో.. భారత్​ పీక్​

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం నుంచి రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో పదకొండు వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానానికి వెళ్లనున్నది. త్వరలోనే యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87,403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా భారత్​లో ఇదేస్థాయిలో కేసులు నమోదైతే యూకేను దాటేస్తామని […]

Read More
BJP

గడప గడపకు బీజేపీ నేటి నుంచి..

సారథి న్యూస్, రామాయంపేట: బుధవారం నుంచి గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నటుట ఆ పార్టీ నాయకులు తెలిపారు. నిజాంపేటలో బుధవారం మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకన్నదని చెప్పారు.

Read More