సారథి న్యూస్, ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీసీపీ సూర్యానారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామానికి చెందిన సురభి వెంకట్ రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణ అనుమతుల విషయంలో కమిషనర్ రవీందర్ రావు బాధితుడు వెంకట్ రెడ్డిని రూ1.5 లక్షలు డిమాండ్ చేయగా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం […]
సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో అక్రమమద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు సకాలంలో సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు. సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వలంటీర్లపై కఠినచర్యలు తీసుకుంటామని.. వారికి అపరాధ రుసుము వేసే విషయంపై అధికారులతో […]
సారథి న్యూస్, నారాయణ ఖేడ్: ఉపాధి పనులు కల్పించాలంటూ కంగ్టి మండల కేంద్రంలో కూలీలు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులు మాత్రమే పనులు చేపట్టి ఆ తర్వాత నిలిపివేయడం సరికాదని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పనులకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.
జైపూర్: భారత్‌కు చెందిన రహస్య సమాచారానిన దాయాది దేశమైన పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఇద్దరు సైనికాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డిఫెన్స్ ఆఫీసర్లు వికాస్ కుమార్ (29), చిమల్ లాల్ (22) శ్రీనగర్ జిల్లాలో ఉన్న ఆర్మీ మందుగుండు సామగ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. వీరిద్దరూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేస్తున్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై ఆఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేసినట్టు ఇంటెలిజెన్స్ అడిషినల్ […]
జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ […]
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బాలకృష్ణ 106 చిత్రంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను బుధవారం బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తెల్లటి పంచెకట్టులో పవర్ ఫుల్ లుక్స్ తో.. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..’ అనే భారీ డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదిరింది. క్షణాల్లో వైరల్ అవుతున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉండి బాలయ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. […]
న్యూఢిల్లీ : మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్‌లో వర్చువల్‌గా నిర్వహించిన ‘బంగ్లార్ జనసంబేశ్’ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎలక్షన్స్‌లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్‌లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్ షా అన్నారు. పొలిటికల్ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు […]
సారథి న్యూస్, నల్లగొండ: సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలు, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. లైంగిక వాంఛలు తీర్చుకుంటోన్న మోస్ట్ డెంజరస్ సైకో అఖిల్ ను మంగళవారం అరెస్ట్ చేశారు నల్లగొండ షీ-టీమ్ పోలీసులు. రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియాలో యువతులు, మహిళలను లైంగికంగా కోరికలు తీర్చుకుంటున్నన్నట్లు విచారణలో వెల్లడించినట్లు నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితుడు అఖిల్ ఉచ్చులో పదుల సంఖ్యల పలువురు యువతులు, మహిళలు ఉన్నట్లు తేలడం గమనార్హం. సికింద్రాబాద్ లోని […]